పుట:Maharshula-Charitralu.firstpart.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

150

మహర్షుల చరిత్రలు

వారికి వరము లొసఁగి వెడలిపోయెను.

మఱియొక పర్యాయము దుర్వాసుఁడు చీరవసనుఁడు, బిల్వ ఖండుఁడు, దీర్ఘశ్మశ్రుఁడు, కృశశరీరుఁడునై రుక్మిణీ సహితుఁడైన శ్రీకృష్ణునికడ కేఁగి యాతిథ్యము కో రెను. శ్రీకృష్ణుఁ డధికభ క్తి నాతనికి నమస్కరించి యుచిత శయ్యావాసముల నేర్పఱచి షడ్రసోపేతముగా విందు చేయుచుండెను. ఆతఁ డొకనాఁడు బహు సహస్రరసంఖ్యాకులు తినఁగలుగుపదార్దముల భుజించును. మఱియొక నాఁడు స్వల్పముగనే కైకొనువాఁడు. ఒకప్పు డుపవాసమే చేయు చుండెను. ఇట్లుండి యొక దినమున దుర్వాసుఁడు నిజశయ్యాస్తరణములను సమస్తహర్మ్యములను భస్మపటల మొనర్సి రుక్మిణీ కృష్ణుల కడ కరుదెంచి తనకు వెంటనే పాయసము వండి పెట్టవలయు నని కోరెను. అట్లే యని రుక్మిణి సిద్ధము చేసెను. ఆ పాయసమును దుర్వాసుఁడు రుక్మిణిదేహమునకుఁ బూసెను. శ్రీకృష్ణుఁ డతి శాంతముతో నుండెను. తుదకు దుర్వాసుఁ డాపాయసమును దనకుఁ బూయు మనెను. శ్రీకృష్ణుఁ డాతని దేహ మెల్లెడలఁ బూసి యాతని పాదములకుఁ బూయ మఱచెను. దుర్వాసుఁ డంత సమయము దొరికిన దని యఱకాళ్లనుండియే కృష్ణునకుఁ బ్రాణభయము కల్లు నని శపించెను.

పిమ్మట దుర్వాసుఁడు రుక్మిణీకృష్ణుల క్షమావిశేషమును బ్రశంసించి శ్రీకృష్ణుఁడు పరమశుభములు చేకొని సర్వలోకప్రియుఁ డగుటకును రుక్మిణీ దేవి జరాజాడ్య వివర్జితయై యుత్తమపతివ్రతా తిలక మగుటకును వరము లిచ్చి తత్క్షణమే యంతర్ధాన మందెను.[1]

  1. ఇది విష్ణుపురాణము, భాగవతమునందుఁ గలదు, కృష్ణునిజూడ వచ్చుచున్న కణ్వ నారద విశ్వామిత్రులు యాదవుల శపించినట్లు భారతము మౌపలపర్వమునఁ గలదు యమునాతటమునఁ దపముచేయ కణ్వమహర్షి కడకు స్త్రీ వేషమువేసి సాంబుని దీసికొనిపోయి యేబిడ్డ పట్టునని యడగఁ కణ్వుఁడే శపించె నని పద్మపురాణమునఁ గలదు.