పుట:Maharshula-Charitralu.firstpart.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దుర్వాసో మహర్షి

143


కాఁజొచ్చెను. వీనివలనఁ దనకు ప్రతభంగము గలుగ దుర్వాసుఁడు మితిమేరలు సమయాసమయములు నెఱుఁగ వలదా యని వారిని మందలించి రాక్షసులై భువి జన్మింపుఁ డని శపించెను. వారు నంత నొడ లెఱిఁగి యాసంయమికి నమస్కరించి ప్రార్థింపఁగా శ్రీకృష్ణునిచేఁ జచ్చినపిదప నాతనికిని, కృష్ణుని కుమారుని తోడిజీవనమున నా మెకును శాపవిమోచన మగు నని పల్కెను. సాహసికుఁ డందులకే గార్ద భాసురుఁ డయ్యెను. తిలోత్తమ బాణుని గృహమున నుషయై జన్మించెను.[1]

దుర్వాసుఁడు వపువను వచ్చరను శపించుట

తొల్లి యింద్రుఁడు నందనోద్యానమున నప్సరసల గానము లాలించువేళ నచటికి నారదుఁడు విచ్చేసెను. అతని సనేకవిధములఁ బూజించి యింద్రుఁడు "మునీంద్రా! ఈ యచ్చరలలో నెవతె యెక్కువయో సెలవిం" డని కోరెను. నారదుఁడు "మంచుకొండ మీదఁ దపముచేయు దుర్వాసు వెవతె చలింపఁ జేయునో యామె యెక్కువ " దని పలికెను. తా మందులకుఁ జాల మని యప్సరస లెల్లరు తలలు వాలించిరి. కాని వపు వను నచ్చర గర్వముతో "మునిరాజా ! నేను దుర్వాసుని వెంటఁ గొనివచ్చెద. అతఁడే యేల? నేను దలఁచు కొన్నచో రుద్రునైనను గామునింటికి ఘట దాసుని జేయుదు" నని చెప్పి దుర్వాసునికడ కరిగెను.

తపస్సున నున్న దుర్వాసుఁ డామె యటఁ బ్రదర్శించిన హావభావవిలాసములకుఁ గనలి పక్షివై పుట్టు మని శపించెను. కడ కాతఁడు కరుణాళువై యామెకు శాపమోక్షము ననుగ్రహించెను. [2]


-

-

  1. బ్రహ్మపురాణము.
  2. మార్కండేయ పురాణము.