పుట:Maharshula-Charitralu.firstpart.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

మహర్షుల చరిత్రలు


వేఱంశమున హరిశ్చంద్రమహారాజు నేడ్పించిన వీర బాహుఁడను చండాలుఁడుగను జన్మించెను. ఆహా! ఎంతటివారికిని గర్మఫల మనుభవింపక తప్పడు గదా![1]

దుర్వాసుఁడు సుప్రతీకు ననుగ్రహించుట

కృతయుగమున సుత్రతీకుఁ డను మహారాజు శుభలక్షణ వతులగు సతు లెందఱనో చెట్టపట్టియు నొక్కపట్టిఁ బడయఁ జాలఁ డయ్యెను. తుద కాతఁడు కుమారు నపేక్షించి దుర్వాసో మహర్షిఁ గూర్చి తపము చేయఁగా నాతఁడు విచ్చేసి “నీకు విద్యుత్ప్రభ యను భార్యయందు సుతుఁ డుదయించు" నని వరమిచ్చి వెడలిపోయెను.

పిదప దుర్వాసుని వరము కతమున సుప్రతీకునకు విద్యుత్ప్రభ యందు దుర్జయుఁడను కుమారుఁడు జన్మించెను. ఆతనికి జాతకర్మాదులు దుర్వాసుఁడే యొనరించెను. పిదప, నాతనికి సర్వశాస్త్రములు నాతఁడే నేర్పెను. దుర్వాసుఁడు పనిబూని యొక యిష్టి వేల్చి యా బాలుని వెంటనే పదునాఱువత్సరముల వానిఁజేసెను. సుప్రతీకుఁడు దుర్వాసుని కెంతయో భక్తిచూప నాతఁడు మెచ్చి సుప్రతీకునికిఁ గాంతిమతి యను నిల్లాలియందింకొక పుత్త్రుఁడు కలుగ వరమిచ్చెను. సుద్యుమ్నుఁ డను కుమారుఁడా మెకుఁ గలిగెను. ఇట్లు దుర్వాసుఁడు సుప్రతీకు ననుగ్రహించెను.[2]

దుర్వాసుఁడు తిలోత్తమాసాహసికుల శపించట

దుర్వాసో మహర్షి గంధమాదనపర్వతముపైఁ దపస్సు చేసుకొనుచు నుండెను, ఆ సమయమున బలిచక్రవర్తి కుమారుఁడైన సాహసికుఁడు నప్పరోంగన యగు తిలోత్తమయుఁ బరస్పర వివశులై

  1. పద్మపురాణము
  2. భూమిఖండము.