పుట:Maharshula-Charitralu.firstpart.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

మహర్షుల చరిత్రలు


జేసినచో నీ పాపము శమించుటే కాక త్రిజగత్పూజ్యత నీకుఁ గల్గు" నని చెప్పి వెడలిపోయెను. ఈలోపున ఘోరవర్షములు గురిసి క్షామము తలఁగుటచే బ్రాహ్మణులు గౌతముని నిందించుచునే వెడలిపోయిరి. గౌతముఁడు తన కిట్టి తప్పిద మేల వచ్చినదని యోగ దృష్టిచేఁ జూడఁగా విఘ్నేశ్వరుఁడు పన్నిన వ్యూహము. తన యింటి కడఁ దిని యసూయాగ్రస్తులైన బ్రాహ్మణులను గోచరించిరి. గౌతమమహర్షి విఘ్నేశ్వరుని దేవకార్యము సిద్ధింపఁ జేయుటయే తన విధియని నిశ్చయించుకొనెను. కాని, యసూయాగ్రస్తులగు బ్రాహ్మణులు తన్నుఁ దిట్టిన కారణమున వారిని బాషండులు కండని శపించెను. ఈ సంగతి యెఱిఁగి బ్రాహ్మణు లందఱు భయకంపితులై వచ్చి గౌతముని శరణువేఁడిరి. గౌతమమహర్షి కరుణించి తన శాపమమోఘ మనియు వారు కొంతకాలమునకు శ్రీకృష్ణుఁడు జన్మించిన పిమ్మట ముక్తినందుదు రనియు జెప్పెను.[1]

గౌతమమహర్షి గంగను భూమికిఁ దెచ్చుట

గౌతముఁడు వెంటనే బయలుదేఱి యహల్యా సహితుఁడై హిమవన్న గమును జేరి యా నగప్రదేశమున నొక్కచోట సౌధాంబస ధేమయూధని స్స్రుతదుగ్ధధారాధునీతీర పారిజాతవనాంతర చింతామణి స్థలమున విడిసి యేక పాదస్థుఁడై మహోగ్రముగ శివునిఁగూర్చి తపస్సు చేయఁదొడఁగెను. అతని తపోమాహత్మ్యమున కచ్చెరువంది శివుఁడు పత్యక్షమయ్యెను. గౌతమమహర్షి శివు ననేకవిధముల స్తుతించి గంగాదేవిని భూతలమునకుఁ బంపుమని వేఁడుకొనెను. శివుఁడనుగ్రహించెను. గంగాదేవి గౌతముని కోరికపై భూతలమునకు వచ్చి మాయా గోవు చనిపోయినచోటఁ బ్రవహించి గోవును బ్రతికించి భూమిని బవిత్రము చేసెను. ఇంతలో గౌతముని నిందించిన వాహ్మణు లా గంగాజలమున స్నానము చేసి తరింప వచ్చిరి. అంత గంగాదేవి

  1. శివపురాణము, జానసంహిత వరాహపురాణము.