పుట:Maharshula-Charitralu.firstpart.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గౌతమ మహర్షి

91

ఇట్లుండగా నొకనాఁడు విఘ్నేశ్వరుఁడు తల్లి కొనర్చిన వాగ్దానము ననుసరించి శివజటాజూటమునఁ గల గంగసు భూమికిఁ బంపివేసినచోఁ బార్వతికి సవతిబాధ యుండదని యుపాయ మాలోచింపఁ దొడఁగెను. గౌతమునంతటి మహర్షికిఁ దక్క. నన్యుల కంత పని సాధ్యము కాదనుకొని గౌతము నాపని కై వినియోగించు ప్రయత్నమున నాతఁడుండెను. ఒకనాఁడు బ్రాహ్మణుల నందఱ సమకూర్చుకొని గౌతమాశ్రమమును వీడి పోవ నాతఁడుద్యుక్తుఁ డయ్యెను. ఈ సంగతి యెఱిఁగి గౌతమ మహర్షి వారి నందఱు నటనే యుండి తన యాశ్రమము నింకను బవిత్రము చేయుఁడని కోరుకొనెను. మాయా బ్రాహ్మణుఁడగు విఘ్నేశ్వరుఁడాలోచించి పార్వతి చెలికత్తె నొకతెఁ బిలిచి మాయా గోవై గౌతముని పొలములో మేయు మనియు, గౌతముఁ డేమి చేసినను వెంటనే చనిపొమ్మనియు నియోగించెను. ఆ ప్రకారమామె మాయా గోవై యట మేయఁ జొచ్చెను. గౌతముఁడు దానిని జూచి యొక గరిక విసరఁగనే యది చనిపోయెను, గౌతముని గొప్పతనమున కసూయాగ్రస్తులగు బ్రాహ్మణులందఱొక్క పెట్టున గోహత్యాపాతకుఁడని గౌతముని నిందింపఁ దొడఁగిరి బ్రాహ్మణరూపమున నున్న గణపతియు నాతనిఁ దూఱి బ్రాహ్మణులెల్లరఁ గూడి యటనుండి పోఁబోవు చుండెను. అహల్యావైభవమును దిలకించి మత్సరగ్రస్తలైన స్త్రీలు నిదే సమయమని యహల్యా గౌతముల నిందించిరి.

గౌతముఁ డసూయపడిన బ్రాహ్మణులను శపించుట

అహల్యాగౌతములు తమకుఁ గలిగిన ప్రమాదమున కెంతయుఁ జింతించి వారల నందఱఁ బాపముక్తి యెట్లు కలుగునో చెప్పి కాపాడుఁడని కోరుకొనిరి. కొంతసేపు బతిమాలించుకొని విఘ్నేశ్వరుడు గౌతమునితో “ఋషివరా ! శివునిగుఱించి తపము చేసి యాతని మెప్పించి శివజటాజూటమునఁ గల గంగాభవానీ నిటఁ బ్రవహింపఁ