పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవతారిక.


1917 వ సంవత్సరమున జనేవరి 20వ తేదీనాడు మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ వార్షికోత్సవ సందర్భమున, కాకినాడ బ్రాహ్మ సమాజమునందు, ఉపాసనానంతరమున వేంకటరత్నమునాయుడు గారు ధర్మ ప్రసంగము కావించిరి. ప్రసంగవిషయము మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ జీవితము!. బోధించినది వేంకటకత్నము నాయుడుగారు! వినలేని బధిరులును, గ్రహింపలేని దీనులును ఉండరుగదా! నాడా ప్రసంగము నాలకించు భాగ్యము నాకు లభించెరు. త్వరలోనే మహర్షి స్వీయచారిత్రమును పఠించి, అత్యంత ఉత్సాహమును జెంది, నా ఆధ్యాత్మికా భావమును, పాండిత్యరాహిత్యమును సహితము గమనింపక గ్రంధము నాంధ్రీకరించుటకు పూనుకొంటిని. నాడు నాయుడుగారు చెప్పిన కథ యీ సందర్భమున స్మరణకు వచ్చుచున్నది. నాయుడుగారు కళాశాలయందు బాలురకు షేక్స్పియర్ మహాకవి నాటకమునకు వ్యాఖ్యానము గావించుచుండగా నేడేండ్లబుడుత డొకడు వచ్చి, కొండొక తడవు బాలురతో గూర్చుండి, యింటికిపోయి, తండ్రితో, నాయుడుగారి షేక్స్పియర్ పాఠమును వింటిన'ని చెప్పెను. మహర్షి స్వీయచారిత్రమును బంగాళీ భాషనుండి శ్రీయుత సత్యేందనాధ ఠాకూర్ , శ్రీమతి ఇందిరాదేవి వంటివారలు భాషాంతరీకరించి ఆంగ్లభాషా ప్రపంచమున కర్పించి యుండగా, ఆంధ్ర ప్రపంచమున కాగ్రంథము నర్పించుటకు తగుదునని నేనును వచ్చితిని.

మహర్షి దేవేంద్రనాధ రాకూర్ జీవిత రహస్యమును సంపూర్ణముగ గ్రహించితినని ఎంతమాత్రము జెప్పసాహసింపనుకాని, నాడు నాయుడుగారొసంగిన ధర్మప్రసంగ దీపికాసహాయ్యమున, నాహ్రస్వదృష్టికింగూడ ఆజీవితమూలసూత్రము లొకింత గోచరములయ్యెనని