పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయ చరిత్రము,


ఏకమైనచో వారిపాఠ శాలలతో తులతూగునవేగాక అంతకన్న దశ గుణము ఉత్కృష్టమైన విద్యాలయములు స్థాపింప లేకపోదుమా ? ఐకమత్యమువల్ల ఏ కార్యము సిద్ధింపకుండును?”


అక్షయకుమారదత్తుని 'వ్యాసము పత్రికలో ప్రకాశితమయ్యెను. పిమ్మట నేను ప్రతిదినము ఉదయము మొదలు సాయం కాలము వరకు కలకత్తాలోనున్న మాన్యులను సంపన్ను అను చూచుటకు బండిలో పోయి, హైందవ బాలురను మిషన్ స్కూళ్లకు పంపకుండ తమస్కూళ్లలో నే విద్యగ జుపుటకు ప్రయత్నములు సాగింపుడని బ్రతిమాల నారంభించితిని. ఒక వంక రాజా రాథా కాంత దేవ్, రాజాసత్యాచరణ ఘోసాల్, మరియొక వంక రామగోపాలగోస్ మొదలగు వారివద్దకు వెళ్ళి వారినందరిని నాయుద్దేశములచే నుత్తేజులను గావించితిని. నాయుత్సాహమువల్ల వారందరును ఉత్సాహపూరితులైరి. దీనితో 'ధర్మసభ' “బాహ్మసభకును గల వైషమ్యములన్నియు నశించినవి. అందరును ఒక్క పక్షమున నే నిలచి, 'మిషన్' స్కూళ్లకు వారి బాలురు వెళ్లకుండు నట్లును, క్రైస్తవప్రచారకులు వారిని క్రైస్తవులలో కలుపుకొన కుండునట్లును ప్రయత్నములు సలిపిరి. జ్యేష్ట శుద్ధ త్రయోదశినాడు ఒక మహా సభ గావింపబడెను. ఒక వెయ్యిమంది సభకు విచ్చేసిరి. క్రైస్తవప్రచారకులు బాలురకు వేతనములు లేక పాఠశాలలు నెలకొల్పి నట్లే మేమును ఒక యుచితవిద్యాలయమును నెలకొల్పవలెనని తీర్మానించి తిమి. మేము చందాపుస్తకము చేత బూని ఎవరెంతవిరాళము నొసంగు దురోయని అపేక్షించుచుంటిమి. అప్పుడు అషుతోష్ దేవ్ , ప్రేమనంధ దేవ్ , మావద్ద నుండి చందాపుస్తకము తీసికొని అందులో పది వేల రూపాయలు చందా వేసిరి. రాజా సత్యాచరణం ఘోసాల్ మూడు వేలరూపాయలు వేసెను. భోజనాధ ధార్ రెండు వేలు, రాజా రాజ కాంత దేవ్వెయ్యి రూపాయలు. ఈ విధముగా నిలచియున్న పాటున' నలబది వేలరూ