పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పండ్రెండవ ప్రకరణము.

55


గుదునా?” అని తోచెడిది. అప్పుడహర్నిశములు ఆకోరిక నాలో జ్వలిం చుచుండెను. నిద్రయందును స్వప్నమునందును ఇదొక్కటే నాకోరిక . ఇదిమాత్రమే నా భావన. నేటికి ఆకాశమునందా తేజోమ యామృత మయపురుషుని చూచినంత నాకోరికలున్నియు నెరవేరెను. నామనో వేదన యంతయు దూరమయ్యెను.


ఈమాత్రము లభించెను, ఇదేచాలునని నేను తృప్తి పొందితిని. కాని, ఇంతియేగదా యనుగ్రహించితిని అని అతనికి మాత్రము సంతృప్తి లేకుండెను. ఇంతకాలము అతడు నా బాహ్యమునందుండెను. ఇప్పు డతడు నాలోన నే యుండి దర్శన మిచ్చుచుండెను. నాఅంతరము నందే ఆతడాసీనుడై యుండెను. జగన్మందిరమున నుండిన దేవత యిప్పుడు నాహృదయ మందిరమునకు దేవతయయ్యెను. అప్పటినుండియు నాతని నిశ్శబ్దగంభీర ధర్మోపదేశము నాకు వినబడుచుండెను. ఇది నేనెన్నడును ఆశించి యుండలేదు. అది నాభాగ్యమున ఘటించినది. నేనాశించిన దాని కతీతమైన ఫలము లభించినది. కుంటివాడనయ్యును పర్వతము లెక్కగలిగితిని. అతని కరుణ యింతటిదని నేను తెలిసికొన లేకపోతిని. ఆతని పొందకుండినప్పుడు నాకుండిన తృష్ణ యిప్పుడాతడు లభించిన పిమ్మట నూరింత లధిక మయ్యెను. అతని నింత మాత్రమే దర్శించితిని, వాణినింతమాత్రమే వింటిని. అందువల్ల నాక్షుత్పిపాసలునివృత్తికాలేదు. భుజించినకొలది ఆకలి అధికమన్న సంగతి వాస్తవముముగదా!


హే ! నాధ ! నీదర్శనము లభించినది. నీవింకను జాజ్వల్యమా నుడవై నాకు దర్శనమిమ్ము, నీవాణినివిని కృతార్థుడ నైతిని. ఇంకను నీ మధురవాణిని నాకు వినిపింపుము. నీ సౌందర్యము నన్యతర రూపము నాసమ్ముఖమునం దావీర్భూతమగునుగాక! నీవిప్పుడు నాకు విద్యుల్లతవలె నగపడి తిరిగి మాయమగు చున్నావు. నిన్ను నేను