పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము.


నడుపుచున్నట్లు తెలిసికొంటిని. ఎట్లాతడు ఆకాశమునందుండి గ్రహ నక్షత్రగణమును నడిపించుచుండునో అట్లే ఆయన నాహృదయమునం దుండి నాసకలధర్మవృత్తులను ప్రేరణ చేసి నాయాత్మను నడిపించుచుం డెను. నిర్జనమునందు, అంధ కారమునందు ఆయన ఆదేశమునకు విపరీ తముగ 'నే కార్యమునైన చేసినప్పుడు ఆయన యొక్క శుభ ప్రేరణననుభ వించుచుంటిని. వెంటనే ఆయన* [1]రుద్ర ముఖమును గాంచుచుంటిని.రక్తము పేరుకొని పోవుచుండెను. మరియు ఏకాంతమునందే దైన సత్కా ర్యము చేసినపుడెల్ల నన్నాతడు బహిరంగముగా సత్కరించుచుండెను. ఆతని ప్రసన్న ముఖమును దర్శించు చుంటిని. సముదయ హృదయము పుణ్య సలిలమున పవిత్రమగు చుండెను. అతడు సర్వదా నాహృదయ మునందధిష్టితుడై గురువువలె జ్ఞానమునుప దేశించుచుండెను. సత్కా ర్యాచరణకు పురిగొల్పెను. "కావున, ““ పితాతుమిమాతా, తుమిగురు జ్ఞానదాతా”—తల్లియను తండ్రియును నీవే, గురువును జ్ఞానదాతవును నీవే,” యని సంతోషముతో నంటిని. దండనమునందును పురస్కారమునందును, ఆయన స్నేహమును గాంచితిని. అతని స్నేహముచే పాలింపబడి, పడుచు, లేచుచు ఇంతదూరమువచ్చితిని, అప్పుడు నావయస్సు 28 సంవత్సరములు.


.

పండ్రెండవ ప్రకరణము.

పూర్వము లోకులు వారివారి తుదమందిరములలో కృత్రిమ పరిమిత దేవతలనుపాసించుట చూచినపుడు "ఈజగన్మందిరమందు ఎప్పుడాయనంత దేవుని సొద్దర్శనము చేసి ఆయననుపాసింపగలు ""

  • మహార్ణయంవజాద్యుతః,