పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము.

52


మాత్రము సంతుష్టి లేక పోయెను. అతని కింకను యివ్వవలెననియే యుండెను. తల్లివలె, నాతనికి మర్పిత ఇవ్వవలెనని యుండెను. నేనె న్నడును ఎరుగనిది ఎన్నడును అడుగనిది....ఇదంతయు కూడ అతనికి వ్వవ లెననియే యుండెను.


బ్రహ్మోపాసనకు గాయత్రి జనసామాన్యమున కుపయుక్తము లేదని 'నేను గహించినను నేనింకను ఆసావిత్రి దేవి నాశ్రయించి యేయుంటిని, ఎన్నడును పరిత్యజింప లేదు. అనేక శతాబ్దములనుండి గాయత్రీమంత్రముపదేశింపబడుచున్నది. అది మనరక్తనాళముల యందు అంతర్లీనమై ప్రవహించుచున్నది. నాయుపనయన సమయమునందీ మంత్రముపదేశింపబడినది కాని నేను దానిని మరచిపోతిని. రామమోహన రాయలు బ్రహ్మోపాసనకు గాయత్రి అనుకూలించునని చెప్పుటచే దాని శ్రేష్ఠత్వమునుగ హించితిని. అప్పటి నుండియు నది నాహృదయము నందు నాటుకొనెను. దానియర్థముతిరిగి తిరిగి పఠించుచు సాధ్యమైనంతవరకు జపింప నియుక్తుడనైతిని, మొట్ట మొదటనేను బాహ్మధర్మ ప్రతిజ్ఞను లిపిబద్ధము గావించి నపుడు గాయత్రీమంత్రము ద్వారాబాహ్మోపాసన చేయు విధానము దానిలోని మీడ్చితిని. గాయత్రి మంత్ర ప్రచారమువల్ల నన్యులకు పకారము చేయ లేక పోయినను నాకుమాత్ర మది బాగుగ ఫలించినది. సమ్యగ్రూపము బాహ్మధర్మమును ప్రతిపాలించుటకుగాను ప్రతిదినమును అభుక్తా వస్థలో మనసును బాగుగ సంసిద్ధము చేసుకొని గాయత్రి ద్వారా ఈశ్వ రునుపాసింప నారంభించితిని.


దినదినమును గాయత్రి యొక్క గూఢ భౌహార్థము సౌమనసునం దుప్రకాశింప నారంభించెను. క్రమక్రమముగా, “ధియోయోనః ప్ర చోదయాత్ ” నాసమస్త హృదయమునందును ఆవరించి యుండెను. ఈశ్వరుడు నన్ను గురించి ఏకాంత సాక్షి మాత్రమే కాడని యిప్పటికి నా