పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునోకండవ ప్రకరణము.

53


కుదృఢనమ్ముకము కలిగెను. ఆయననా అంతరము నందుండి అనుక్షణ మున నాసకల బుద్ధినృత్తులను ప్రేరణ చేయుచుండెను. అప్పటినుండియు నాయనతో నొక ఆంతర్యసం బంధములో నిబద్ధుడ నైతిని. దూరము నుండి ప్రమాణము చేయుటనల్ల నే కృతార్ధుడనను కొనుచుంటిని. ఇప్పుడాయాశకు అతీతమైన ఫలము ప్రాప్తించినది. ఆయన నాకు దూరముగ నుండుట లేదు. కేవలముమూగసొక్షి కాడు. కాని నా అం తరము నందుండినా సకలబుద్ధి వృత్తులను ప్రేరణ చేయుచున్నాడు. అప్పు డు నేననుకొంటిని; “ నేన సహాయుడను కాను, ఆయనయే నాచిర సహాయుడు. ఎప్పుడాతనిని కనుగొన లేక విచారముతోను,నిరాశతోను, తీరుగు చుంటినో, అప్పుడే అతడు నాఅంతరమునందుండి నాఅంతర చక్షువులను, నాజ్ఞాన నేత్రములను తెరచుచుండెను. అతడింతకాలము నన్ను చెయ్యి పట్టుకొని నడుపుచుండెనని కనుగొన నేర నైతిని. ఇప్పుడతనిని తెలిసికొని, అతని హస్తము పట్టుకొని నడచుచున్నాను.


ఇది మొదలు నే నాయన ఆదేశముల వీన నేర్చుకొన నారంభించితిని, నామనో ప్రవృత్తికినీ ఆయన ఆ దేశమునకును గల భేద భావము తెలిసికొన నారంభించితిని. ఎయ్యది నాప్రవృత్తి యొక్క కుటిల ప్రేరణయని తోచెనో దానిని పరిత్యజించుటకు యత్న శీలుడ నైతిని.ఎయ్యది ఆయన ఆ దేశమని సౌధర్మబుద్ధికి తోచుచుండెనో దానిస నుసరించుటకు ప్రయత్నములు సలుపుచుంటిని. అప్పుడాతని చెంత నీట్లు సాధించుచుంటిని – “నీవు నాకు శుభబుద్ది ప్రేరణచేయుము, బలము "ప్రేరణ చేయుము, ధైర్యమునిమ్ము, శౌర్యమునిమ్ము,తితిక్షా-సంతోషములనిమ్ము.” గాయత్రీమంత్రము నను సరించుటవల్ల నాయాశలనతీతించి ఎట్టి ఫలమును పొందితిని ! ఆయనదర్శనమును పొందితిని !ఆయన ఆ దేశమును శ్రవణము గావించితిని. ఒక్కసారిగా ఆయన స్నేహి తుడనై పోతిని. ఆయన 'నాహృదయమునం దాసీనుడైయుండి నన్ను