పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము

పదునొకండవ ప్రకరణము


పూర్వము నేను నాక్షుద్రబుద్ధి సిద్ధాంతము వల్లను, ఈశ్వర ప్రసాదము వల్లను, ఏసత్యమును కనుగొన గలిగితి ఆసత్యములు ఉపనిషత్తులలో జాజ్జ్వల్య రూపము గానుండుట చూచి నామనస్సు, హృదయము పరితృప్తినొందెను. ఈశ్వరుడు, “సత్యం, జ్ఞానం, అనంతం,బ్రహ్మ” యని ఉపనిషత్తులవల్ల తెలిసికొంటిని. ఒకప్పుడు నేను ప్రకృతియొక్క. నిరంకుశ పరాక్రమమునకు భీతి చెందుచుంటిని. ఇప్పుడు ప్రకృతిపై ఒక నియంతకలడని యీక్షణమందు తెలిసికొంటిని. ప్రకృతి ఒక్క పురుషుని స్వభావముపై ఆరూఢమై యున్నది.


"స్వభావనాధి తిష్ఠత్యేకః

అతని ఒక్క చౌకు దెబ్బతో నంతయు చరించుచున్నది.

“భయాదస్యాగ్ని స్తపతి భయా త్తపతి సూర్యః "

అతడు రాజుల కెల్ల రాజైన మహారాజు. అతను మనతండ్రి,తల్లి, సఖుడు. ఇది తెలియుటచే నిర్భయుడ నైతిని. ఆయన నుపాసించి కృతార్థుడనై తిని. నిర్జనమునందు ఏకాకి నై ఆయన మహద్భావమునుజూజ్జ్వల్య ప్రభావమును అనుభవించితిని. బ్రాహ్మసమాజము నందు నాసోదరులతో గూడి యీతని గుణగానము చేసితిని. మిత్రులందరితో గూడి పరమసఖు నాహ్వానించితిని. ఇందువల్ల నాకోరిక లన్నీ యుతీరెను.


ఈశ్వరుని పొందనంత కాలము ఈ పృధ్వి యందందరును భాగ్య పంతులనియు, నేనొక్కడనే భాగ్యహీనుడననియు అనుకొను చుంటిని. ఎందరో యీశ్వర సాన్నిధ్యమునకు త్వరపడు చుందురు. ఎందరో విశ్వే శ్వరుని మందిరమునకు, ఎందరో జగన్నాధ క్షేత్రమునకు, మరెంద రో ద్వారకకును హరిద్వారమునకును, లెక్కకు నెక్కువై పోవు