పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

మహర్షి దేవేంద్రనాధ రాకూర్ స్వీయచరిత్రము.

ఇంకెవ్వరు దీనికర్దము చెప్పగలరని అతని నడిగితిని. అతడు, " దీనిని చూడ ఇదంతయు బ్రహ్మసభను గురించి యున్నట్లు తోచును. బ్రహ్మస భాద్యక్షుడగు రామచంద్ర విద్యా వాగీశుడేమైన చెప్పగలుగు నేమో” అనెను. అట్లైన నతని పిలువు మంటిని. కొంత సేపటికి విద్యా వాగీశుడు నావద్దకు వచ్చెను. అతడా పుటను చదివి " ఈశావాశ్యమిదం సర్వం యత్కించ జగత్యాంజగత్ | తేనత్య కేస భుండథా మాగృత దాక స్య సద్ధసం” ఇది ఈశోపనిషత్తులోనిది అనెను.


విద్యా వాగీశునివద్ద దీని అర్ధమును నేర్చికొని నప్పుడు స్వర్గమునుండి అమృత 'ధారలు వచ్చి నాశిరముపై వర్షించినట్లు తోచెను. నేను మనుష్య సామాన్యుల యొక్క ప్రోత్సాహము కొరకు చిరకాల మునుండి పరితపించుచుండగా ఇప్పుడు స్వరమునుండి దైవవాణి యేవచ్చి నాధర్శజీవనమునకు తోడుపడినది. నాకోర్కె నేటికి ఫలించినది. ఈ శ్వరుని అంతటను దర్శింపవలెనని నాకోరిక. ఉపనిషత్తులలో చెప్పబడిన దేమి ? యావద్విశ్వమును ఈశ్వరునితో నిండి నిబిడీకృతమైయున్న దనియేగదా. అట్లయినచో ఇక ఆ పవిత్రత అనునది ప్రపంచమున ఎక్కడ ఉండగలదు ? ఈశ్వరును సకలమునందును ఉండుట వల్ల సకలమును పవిత్రమే అగును. జగత్తు మధుమయమగును. ఇట్టి సత్యముల కొరకే నేనింత కాలమును పరితపించు చుంటిని. నేటికి అవి నాకు దొరకినవి. నా మనోభావములు మరెక్కడను ఇంత చక్కగా తెలుప బడియుండ లేదు. మనుష్యమాత్రు లీరీతిగ ఎవరు చెప్పగలరు ? ఆయీశ్వరుని కరుణ నాహృదయమునందు ప్రవేశించి వ్యాపించినది. "ఈశావాశ్యం మిదం సర్వం” అను గూఢ వాక్యము యొక్క గంభీర భావము నేను గ్రహించితిని. ఆహా ! ఎట్టి సంగతి వింటిని ! " తేనత్వ కేన భుంజీత ” “ అతడు నీకు ప్రసాదించిన దాని నానందముతో ననుభ వింపుము. ” అతడిచ్చిన దేమి ? అతని సాంగత్యమే. ఈ పరమైశ్వర్యము