పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐదవ ప్రకరణము.

23


సనుభవింపుము. తక్కినవన్నిటి నిత్యజించి ఆ పరమ ధనమును మాత్రమే పొందుము. అతనిని మాత్రమే ఆశ్రయించి తక్కినవన్నిటిని వదలి వేయుము. అట్లు అతనిని మాత్రమే ఆశ్రయించి యుండిన వాని భాగ్యము ఎంతమహత్తరము ! ఇట్టిదానినే నేను చాల కాలమునుండి కోరి యుంటిని. దీనినే ఇదియు బోధించుచున్నది.


నావిషాద మంత తీవ్రముగ నుండు టేలయన, నాకిహలోక సౌఖ్యమును పరలో కానందమును కూడ లేక యుండెను. సంసారము సందు నాకేవిధమైన సౌఖ్యమును లేకపోయెను. ఈశ్వరుని యందానందము అనుభవింద లేకుంటిని.


కాని సంసారిక సౌఖ్యములను భోగములను త్యజింపుమనియు కేవలము ఈశ్వరుని మాత్రమనుభవింపు మునియు ఆదివ్యవాణి వచించి నప్పుడు నాకు కావలసినది దొరకినది. ఆనందములో ఒక్క మారుగా మునిగిపోతిని. ఇది నాదుర్బలబుద్ది యొక్క ఉపదేశము అనుకొన నక్క రలేదు. అదంతయు కేవలము ఈశ్వరోపదేశమే. ఏఋషీశ్వరుని హృదయమునుండి ప్రథమమున ఈమహాసత్వము వెలువడినదో ధన్యుడు గదా అతడు ! నేటికి ఈశ్వరునియందు నాకు దృఢవిశ్వాసము జనించి నది. నేను సంసారానందమునకు బదులుగా బ్రహ్మానందమును చవిజూచితిని. ఆహా ! ఆదినమెంత శుభదినము ! ఎంత పవిత్రదినము ! ఉపనిషత్తులలోని ప్రతి: దమును నాజ్ఞానమును ప్రజ్వలింప జేసెను. ఉపని షత్తులను సహాయముగా దీసికొని నా గమ్య స్థానమునకు నడువ నారంబించితిని. ఇప్పటినుంచి సకలగూఢార్థములును నాకు వ్యక్తములగు చుండెను. అంత ఈశ కేన, కఠ, ముండక, నూండూక్యోపనిషత్తు లన్నియు విద్యావాగీశుని వద్ద క్రమముగా చదివితిని. మిగిలిన ఆరింటిని మరికొందరు పండితుల వద్ద చదివితిని. ఏదినమున చదివినదాదినమే కంఠస్థము చేసి మరుసటి దినమున విద్యా వాగీశుని కప్పగించు చుంటిని.