పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

మహర్షి దేమేద్రనాధఠాకూర్ స్వీయచరిత్రము.

సంబులు వనంబులు నుపవనంబులు: జిత్రధాతువిచిత్రతంబులయిన పర్వతంబులు సమదకరికర విదళిత శాఖలుగల 'శాఖలు నవారితని వారిత పథిక జన ప్రేమాతి రేకంబు లైన తటాకంబులు బహువిధ విహంగనినద మనోహరంబులై వికచారవింద మధుపాన పరవళీ పరిశ్రమ దమరసుందరంబులైన సరోవరంబులుఁ దాటి చనుచుకుత్పిపాసాస మేతుండనై యొక్క నదీ హ్రదంబున గ్రుంగుంకులిడి శుచినై నీరు ద్రావిదాని గతశ్రళముండనై.

క. సాలావృక కపిభల్లుక
కోలేభలులాయశీల్య భూక శరభశా
ర్ధూల శశగవయఖడ్గ
వ్యాళాజగరాది భయద వనమధ్యమునన్

వ. దుస్తరంబు లైన నవవేణు కీచక గల్మల తాగహ్వరంబుల పొంతనొక్క రావిమా నిదగ్గగర కూర్చుండియే విన్న చందంబున నాహృదయగతుం బరమాత్మ స్వరూపు హరింజింతించితి.

శా. ఆనందాశులు గన్నుల వెడల రో మాంచంబుతోఁదత్పద
ధ్యానారూడుడనైన నాతలపులో నడ్డేవుకుందోచెనే
నానం ద్ఫాగతుండ నై యెఱగలే నైతికొననున్నీ శ్వరున్?
నానాశోకహమైన య త్తనవుగానన్| లేక యట్లంతటన్.


వ. లేచినిలచుండి క్రమ్మర నద్దేవుని దివ్యాకారంబు జూడనిచ్ఛించుచు హృదయంబున నిలుపుకొని యాతురుండునుం బోలేచూచియం గాన లేక నిర్మనుష్యం బైన వనంబునం జరియించుచున్న నన్నునుద్దేశించి వాగగోచరుండైన హరిగంభీర మధురంబులైన వచనంబుల శోకంబువశర మింపం జేయు చందంబున నిట్లనియె.

ఉ. వలకుమార శోషిలగ , నీజననంబున నన్ను గానగా
జాలవునీవు కామముఖ షట్కము నిరళితంబుచేసిని