పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియొక టవ ప్రకరణము.

159


ఇక్కడ సుఖానంద స్వామిని చూచితిని,ఆయన తాంత్రిక బ్రాహ్మోపాసకుడు, హరిహరానందతీర్థ స్వామిశిష్యుడు. ఈహరిహరా నందునితో రామమోహన రాయలకు చాల స్నేహముండెను. అతడు రామమోహన రాయ్ తోటలో నే యుండువాడు. ఇతనిక నిష్ట బ్రాతయే రామచంద్ర విద్యా వాగీశుడు. నేను ఢిల్లీ ప్రవేశింపగానే సుఖానంద స్వామి నాకు అంజూరా మొదలగు ఫలములను పంపెను. నేనాతనికి బహుమతులు పంపి ఆతనిని చూచుటకు పోతిని. అతడును నన్ను తిరిగి దర్శింపవచ్చెను. ఈరీతిగా నాకాతనితో పరిచయమయ్యెను. సుఖా నందస్వామి "నేను రామమోహన రాయలు కూడ హరిహరానందతీర్థ స్వామి శిష్యులము. నావలెనే రామమోహనుడు తాంత్రిక బ్రహ్మ వధూత” అనెను. సకలధర్మసాంప్రదాయకులును రామమోహనుని తమవంక కే లాగుకొందురు.


సుప్రసిద్ధమగు 'కుటుబ్ మినార్ ” ఇచటికి 16 మైళ్లుండెను. నేను దానిని చూచుటకు పోతిని. ఈయుత్కృష్ట గోపురము పూర్వము హిందువులచే కట్టబడినది. కాని ముసల్మానులిప్పుడు దీనిని కుటుబు ద్దీన్ పాదుషా జయస్తంభమందురు. కావుననే యది కుటుబ్ మినారని పిలువబడుచున్నది. ముసల్మానులు హిందువులను పరాజితుల నెట్లు చేసిరో అట్లే వారికీర్తి కూడ నాశనము చేసిరి. “మినార్” అనిన నొక యున్నత స్తంభాకార ప్రాసాదమని యర్ధముము, కుటుబ్ మినార్ 161 మూరలు ఎత్తుండును. నేనాగోపురము యొక్క కట్టకడపటి శిఖరము నెక్కి క్రిందకు జూచితిని. నభోమండలము క్రింద సుదూరముగ వ్యాపించియున్న ఆ విశా లమగు బయళ్ళను జూడగ నాశ్చర్యానందములతో నాయొడలు ఫుల కరించెను. ఇది యా ‘మహతో మహీయాన్' యొక్క మహామహి మను చాటుచుండెను.