పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

మహర్షి దేవేంద్రనాధఠాకూర్ స్వీయచరిత్రము,


ఇక్కడనుండి గుఱ్ఱపుబండి మీద నింకను పశ్చిమముననున్న అంబోలా (Umballa) కు పోతిని. ఇచ్చటనుండి ఒక్క కిశోర్నాధుని మాత్రము వెంట బెట్టుకొని ఒక డోలీ కుదుర్చుకొని లాహోరునకు పోతిని. లాహోరునుండి తిరిగివచ్చి ఫాల్గుణ చతుర్థినాడు అమృత సరోవరము చేరి తిని. అప్పుడక్కడ శీతలము మిక్కుటముగ నుండెను.

ముప్పది రెండవ ప్రకరణము.

నేనమృతసరోవరము చేరితిని. కాని నా లక్ష్య మింకను శీఖులు అలఖ్ నిరంజనుని ఉపాసించు ఆ అమృత సరస్సు మీదనే ఉండెను.అతిప్రత్యూష ముననే అమృత్సర్ పట్టణముగుండా ఆ యమృత్సరపుణ్యతీర్థము జూడ బయలు వెడలితిని. అనేక వీధులు తిరిగి తిరిగి కడకొక పథికుని, " అమృత్సర మెచ్చటనున్నద ” ని యడిగితిని. అతడా శ్చర్యముతో నాముఖము వంక తేరిచూచి, " ఏమిది? ఇదే అమృత్సరమనెను. " ఇది కాదు, పరమేశ్వరునకు భజనజరుగుచుండు ఆయమృత్సర మెక్కడ?" నంటిని. “ఓ హె! గురుద్వారమా? చెంత నేయున్నది, ఈ దారిని పొమ్మ"ని అతడు చెప్పెను.


నేనా నిర్దిష్ట పథమునచని ఎర శాలువుల యొక్కయు, రంగురుమాళ్ళ యొక్క-యు బజారు దాటి, మందిరము యొక్క స్వర్ణరచిత గోపురము సూర్యకిరణములతో దీప్తివహించియుండుట గాంచితిని. దీనిని లక్ష్యమునందుంచుకొని మందిరమునకు పోయి ఒక్క మహత్తరపుష్కరిణిని గాంచితిని. ఇది కలకత్తాలోనున్న ' లాల్డిగి ' కన్న నాలు గైదు రెట్లు పెద్దది. ఇదియే సరోవరము. మాధవపురమునందలి కాలువద్వారా ఐరావతీనది యొక్క జలమువచ్చి ఈ సరోవరమును నింపు