పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది యొకటవ ప్రకరణము.

157


మార్గ మధ్యమున నేదో యొక వృక్షచ్ఛాయను వంట చేసికొని భుజించు చుంటిమి. ఆగ్రాలో “టాజ్ మహాల్ ” చూచితిని. ఈ టాజ్ పృథివి కంతకును టాజ్ (కిరీటము). “టాజ్ మహల్ ' లో ఒక గోపుర మెక్కి సూర్యుడు పశ్చిమదిక్కు నంతను ఎర్రబరచి అస్తమించుట చూచితిని. క్రింద నీలవర్ణపు యమునా. మధ్య నాశుభ్రమో స్వచ్ఛమో, టాజ్ సొందర్యశోభతో చంద్రమండలమునుండి పృథివిమీద ఉట్టిడెనా అన్నట్లు తోచుచుండెను.


మార్గశిర బహుళ ఏకాదశి నాడు ఈ యమునా మీదుగా ఢిల్లీకి పయనమైపోతిని. పుష్యమాసపు శీతలములో నేను కొన్ని సార్లు యమునా నదిలో స్నానమాడితిని. చలిచే రక్తము పేరుకొనిపోవుచుండెను. పడవదారిని పడవపోవుచుండెను; కాని నేను మాత్రము యము నాతీరమున సస్య క్షేత్రముల మధ్యనుండియు, గ్రామముల మధ్యను డియు, ఉద్యానవనములలో నుండియు నడచుచు ప్రకృతి సౌదర్యమును చూచుచు పోవుచుంటిని. అందుమూలమున నామనసున కమిత శాంతి కలిగెను. 11 దినములలో యమునా తీరముననున్న మధురాపురము చేరితిని. మధురను చూచుటకు బయలు వెడలితిని.

యమునాతీరమున సన్యాసుల కొక సత్రముండెను. ఆ సత్రము నుండి ఒకడు నన్ను హిందీలో “ఇదర్ ఆయ్ యే కూచ్ శాస్త్ర చర్చ క రేంగే” — (రమ్ము యిచట మనము కొంచము శాస్త్ర చర్చ చేతము) అని పిలచెను. నేనప్పుడు మధురాపురము చూడవ లెనని యుత్సాహ ముతో నుంటిని. కావున అతని కేమియు ప్రత్యుత్త రమీయకయే నడ చిపోతిని. కాని తిరిగివచ్చునప్పుడు అతనివద్దకు పోతిని. అతడు పుస్తకములకట్ట విప్పి కొన్ని లిఖితగంధములను బయటకు తీసెను. అవన్నియు రామమోహన రాయల గ్రంధముల యొక్క హిందీ భాషా తరీకరణములు, మహా నిర్వాణతంతో శిక అహ్మస్తోత్రమును ("నమస్తే