పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

మహర్షి దేవేంద్ర నాధఠాకూర్ స్వీయచరిత్రము.



కపదార్థములు-అస్థాయియగు పుష్పము, హ్రసమానమగుస్త్రోతము, భంగురమగు ప్రాసాదము, క్షయశీలమగు వర్ణ చిత్రము, దీప్త మానమగు లోహ రాశి మామనస్సులలో ప్రతీతమై మాచిత్తముల సౌకర్షించు చుండును. మేము వానిని శుభ దాయక వస్తువులనుకొను చుందుము. కాని అవి మాకు ప్రదానము చేయుచున్న సుఖము నీవే వానిద్వారా ప్రదానము చేయు చున్నావను వివేచన మాకు లేదు. ఏసౌందర్యమును నీవు సృష్టి పై వర్షింపచేయుచున్నావో ఆ సౌందర్యము మాదృష్టినుండి నిన్ను మరుగు చేసినది. నీవు మాయింద్రియములకు గమ్యుడవు కానంతటి పరిశుద్ధుడవు, మహాత్ముడవు. నీవు సత్యంజ్ఞాన మనంతం బ్రహ్మ". నీవు "ఆశబ్దమస్పర్శమరూపమవ్యయం తధాసన్ని రత్యమగంధ వచ్ఛ" గావున ఎవరు పశుతుల్యమైన కృత్యముల నాచరించి వారి స్వభావమును నికృష్టము చేసికొందురో, వారునిన్ను కాంచ నేరరు. అయ్యో! కొందరు నీ ఆస్తిత్వము యెడల కూడ సందేహము చెందుచుందురు. ఏమి మా దౌర్భాగ్యము! సత్యమును ఛాయయనియు, ఛాయను సత్యమనీయు అనుకొనుచుందుము. ఎందుకునుపనికి రానివి మాకుత్కృస్టముల వలె తోచును. నిజముగా మాకు సర్వస్వముగ నుండవలసినది మాకెందుకును పనికి రాసిదిగ తోచుచున్నది. ఈవృథాశూన్య పదార్దములే అధ స్థాయులగు ఈ అథముల మనస్సుల కుపయుక్తము లైనవి ! హే! పరమాత్మా! 'నేనేమి చూచుచున్నాను ? సకలవస్తువులలోను ప్రకాశమానుడవైన నిన్నే చూచుచున్నాను. ఎవరునిన్ను చూడజాల కున్నారో వారేమియుచూడజాలరు. ఎవరికినీయందు అభిరుచి లేదో వా రేవస్తువునందును అభిరుచి గాంచ నేరరు, వారి జీవితము స్వప్న ప్రాయము, వారి ఆస్తిత్వము వృధా. ఆహా, నీ జ్ఞానాభావముతో నేయాత్మ సుహృదులు లేనిదై , ఆశ లేనిదై, విశ్రమస్థానము లేనిదై యుండునో ఆయాత్మ కెంత యసౌఖ్యము! ఏఆత్మనిన్నను సంధానము చేసి, నిన్ను పొందునిమి