పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము,



సప్తాహము గడచిపోయెను. మాఘ ఏకాదశికి గృహము సిద్ధమయ్యెను. సమాజగృహము నూతన వేషధారణ కావించెను - శ్వేతపస్తర వేది, సమ్ముఖమున సుసజ్జ తగీతమంచె, పూర్వ పశ్చిమములందు మోచ్చ కాప్టాసనములు (Kcoden Gallery - సకలము నూతనము, సకలము సుందరము. శుభము. పలకల గాజుకుప్పె దీపములతో సమస్తము వెలుగొందింప బడెను. సాయంకాలము సమాజము వద్ద మాయింటిలో నుండు వారందరితో సిద్ధ మైతిమి. అందరి ముఖముల యందు నూత నోత్సాహము, నూతనాను రాగము; అందరును నానందములో పూర్ణులు. విష్ణు సంగీతమంచె నుండి "పరిపూర్ణమానందం" అను గీతమునందు కొనెను. పిమ్మట బ్రహ్మూపాసన ప్రారంభమయ్యెను. మేమందరము మిళితమై సమ స్వరము , స్వాధ్యాయము పఠించితిమి. బాహ్మ ధర్మగంధము నుండి శ్లోకములు ఆవృత్తి గావింపబడెను. ఆఖరున ""శాంతిశ్శాంతి శ్శాంతిః, హరిః ఓం.” అను పదములతో ఉపాసన సమాప్తమయ్యెను.


అందరును స్తబ్ధులైరి. అప్పుడు నేను వేదిక ముందు నిలబడి ప్రహృష్టాంతరంగుడనై, భక్తిభరితుడనై ఈ స్తోత్రము పఠించితిని. “చతుర్దిశలయందు నీవు వ్యాపింప చేసియున్న సుశోభనదృశ్యమగు యీవిశ్వము ద్వారా, అనేకులకు నీవు ఉపలబ్దము కాకుండిసచో దానికి కారణము నీవు మాకెవ్వరికిని దూరము గానుంటివని కాదు. మేము హస్తములతో స్పృశించు చున్న వస్తువుల కంటెను కూడ మాసమీపమున నీవు జాజ్జ్వల్యతరుడనై ప్రకాశించుచున్నావు. బాహ్య వస్తు ప్రవృత్తమైన మాఇంద్రియ సముదాయము మమ్ము మహామోహములో ముద్గులను గావించి నీనుండి విముఖులను కావించుచున్నది. అంధకారముమధ్య నీజ్యోతి ప్రకాశించు చున్నది. కాని అంధ కారము నిన్నెఱుంగ గలదా?


మసి తిస్టన్ తమసోః అంతరోయం తమో న వేద" నీ వెట్లంధ కార