పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది నాల్గవ ప్రకరణ:

125

.


నుండి ఇది వెలువడినదో అతడు పూర్ణ సత్యము. ఇది (విశ్వసంసారము) పేక్షిక సత్యము. దీనికో మాయావాదము నిరస్థమయ్యెను.


ఇంత పర్యంతము బ్రాహ్ములకు ఏదియు ధర్మగ్రధము లేకుండెను. వారిధర్మము, మతము, అభిప్రాయములు నానాగ్రంధములలో సంషిక్షిప్తములై యుండెను. ఇప్పుడవన్నియు ఏకగ్రంధములో సంక్షిప్తతమయ్యెను. ఇది అనేక బ్రాహ్ముల హృదయము నాకర్షించి పుణ్యసలిలముతో విత్తము గోవించెను. హృదయములు కలవారి నందరిని ఈ బ్రాహ్మధర్మగ్రంధము ఆకర్షించియే తీరును. బ్రాహ్మసమాజ ఉపాసనా సమయమునందు పూర్వపు వేద పఠనమునకు బదులు ఈ బ్రాహ్మధర్మములో ప్రథమాధ్యాయము చదువుట ప్రారంభింపబడెను. అప్పటినుండియు ఉపాసనా సమయమునందు బ్రాహ్ములు

[1]


అను మంత్రమును తీసికొని కొందరు మూలశబ్దములతోను కొందరు దాని భాషాంతరీకరణముతోను ప్రార్థన చేయ నారంభించిరి.


గతవత్సరమునుండియు సమాజగృహము యొక్క మూడవ అంతస్థు నిర్మింప ప్రారంభింపబడెను. ఈ సంవత్సరము మాఘ ఏకాదశి లోగా దానిని సిద్ధము చేయుటకు తొందర పెట్టుచుంటిమి. ఇది బ్రాహ్మసమాజము యొక్క 19 వ సాంవత్సరికోత్సవము. నూతన అంతస్థు నందు కూర్చుండి, ఉదాత్త అనుదాత్త సర్వముతో నూతన స్వాధ్యాయము పఠింతుము, నూతనస్తోత్రములతో ఆస్త వనీయుసకు ఉపాహార మొసంగు

దుము; నూతన గీతములను గానము చేతుము. ఈ ప్రయత్నములందే ఆ

  1. “ అసతోమా సద్గమయ” * తమసోమా జ్యోతిర్గమయ | మృత్యోర్మా అమృతంగమయ | ఆవిరావీర్మ ఏధిరుద్రయత్తే | దక్షిణంముఖం తేవమాం పాహినిత్యంః|