పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము


ముహూర్తము మహారాజు గారికి వర్తమానము చేయుటకు నావాస సొనమునుండి రాజమందిరమువరకు అంచీలమీద మనుజు లుంచబడిరి. మరునా డుదయము నా వద్దకు మూడునాలుగు బండ్ల మీద బియ్యము, పప్పు, గోధుమపిండి, సగ్గుబియ్యము మొదలగు భోజనసామాగ్రులు నాబసకు వచ్చియుండెను. ఇంతసామానేల పంపబడెనని అచటనున్నవారి నడిగితిని. రాజగురువున కేర్పాటు చేయబడిన పద్ధతిని మీకును మహా రాజుగారు పంపిరని వారు చెప్పిరి. మధ్యాహ్నము నాబస వద్ద కొక జోడుగుఱ్ఱముల బండి వచ్చి నిలబడి యుండెను. నేను బండిలోనెక్కి 'రాజమందిరమునకు వెళ్ళితిని. రాజును కలసికొంటిని. ఆయన నాకత్యంతాదరముతో స్వాగతమిచ్చెను. అతడప్పుడొక బంతియాట (Billiards) నాడు చుండెను. నేనును ఆయాట వేడుక చూచుచుంటిని.ఆయన నన్నొక యున్న తాసనముపై కూర్చుండ బెట్టెను. ఆతని నంరత, వినయము, అనురాగము చూడ ఆయన యెడల నాకును అనురాగము బయలు దేరెను.


ఈ ప్రకారముగా ఆయన నాతో సమ్మిళిత మయ్యెను. క్రమముగా నతనికి బాహ్మధర్మమునందుత్సాహము అభివృద్ధి చెందు చుండెను. నా ప్రేరణవల్ల ఆయన రాజమందిరములో నొక బ్రాహ్మసమాజము స్థాపించెను. ఈబ్రాహ్మసమాజములో నుపాసన ఫలుపుటకును, రాజుగారికి బాహ్మధర్మము నందుపదేశము నిచ్చుటకును శ్యామచర ఇభట్టాచార్యుని, తారక నాధ భట్టా చార్యుని ఆయన వద్దకు పంపితిని. అటుపిమ్మట "నేను తరుచు బద్యానుకు వెళ్ళి యాతనియు త్సాహము పురికొల్పుచు, నాతనితో ధర్మాలోచన సలుపుచుండువాడను. ఆయనయు నన్ను జూచి అత్యంత సంతుష్టి చెంచెందుచుండెను. నాతని జన్మోత్సవమునకు వెళ్ళినను వనభోజనమునకు వెళ్ళినను, మరియేయితర సందర్భములలో వెళ్ళినను, నాతో కలసి ఆయన బ్రహ్మోపాసన గావిం