పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియొక టవ ప్రకరణము.

105



చుచుండెడివాడు. అతని హృదయమునందు భక్తియు శృద్ధయు కూడ నుండెను.


ఒక రాతి బ్రహ్మోపాసనా సమయమునం దాయన ఈరీతిగా ప్రశంసించెను. " నే నెంతకృతఘ్నుడను. నాకీశ్వరుడింత సంపదనిచ్చి యున్నాడు. అందుల కాతనియెడల నేను యధోచిత కృతజ్ఞత జూపుట లేదు, నేనాతని స్మరించుట లేదు. కాని ఎంద రెందరు దీనదరిద్రులుఅతనివద్ద బహుస్వల్పమును పొందియు నాయనయెడల నెంతకృతజ్ఞులై అతనిని పూజించు చున్నారు. నేనెంతకృతఘ్నుడను ! ఎంత అధముడను!" అని యీమాటలతో నతడు కన్నీరు కార్చ నారంభించెను. ఒక నాడు ఆయన నన్ను తన అంతఃపురాంతర్భాగముల లోనికి తీసికొని పోయెను. అచ్చట నొక పుష్కరిణి యుండెను. దానిని నాకు జూపి, “మేమిచ్చటకూర్చుండి చేపల పట్టుదుము” అనెను. పిమ్మట నన్ను మేడమీదికి గొనిపోయెను. జల్లారు మప్లందు పరుపబడిన యొక గదియుండెను. అది వివాహ గృహమువలే అలంకరింపబడి యుండెను. అదిచూపి, “ మేమిక్కిడ కూర్చుందుము' అనెను. ఇంకొకగది లోనికి గొనిపోయి, “ఇచ్చటనుండి బిలియర్డ్సు ' ఆడుచుండ రాణి నన్ను చూచుచుండును ” అని చెప్పెను. అంతః పురములో నేను కని వినియుండిన దానిని బట్టి రాజు రాణి యెడల నెంత ప్రీతితో నుండెనో రాణియు రాజు యెడలగూడ నంత ప్రీతితోనే యుండినట్లు తోచెను. “ సంతుఁ భార్య,భర్త భర్త్రా భార్యాత దైవచ.”

రాజు నాతో నొకనాడు, “ నాకొక కోరిక యున్నది. మీరు దానిని తీర్పవలెను” అనెను. ఏమడుగునో గదాయనుకొని, చెప్పుమంటిని. “మీరొక సారి దయ చేసి కొంచము శ్రమ తీసుకొని కూర్చుండ వలెను. తమపఠము చిత్రింపించవలెనని యున్నది, ” అనెను. నేర్పరియగు నొక ఆంగ్ల చిత్ర లేఖకు డప్పుడాతని యింటికి వచ్చెను. ఆతడు