పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియవ ప్రకరణము.

99



బాహ్యజడ స్వరూపము నుపాసింతురని కాదు అర్ధము. వాని అంతర్యామియై ఏచైతన్య పురుషుడున్నాడో, అతనినే యుపాసింతురని.పురాణములలోను, తంత్రములలోను ఉండు దేవతలకును, వేదములలోని దేవతలకును మిక్కిలి భేదమున్నది. కాని జన సామాన్యము ఈ భేదము నెఱుగరు. కాళిదుర్గ పూజలు 'వేదములో విధింపబడి యున్న వని వీరి వ్విశ్వాసము. ఈశ్రమల నన్నింటిని తొలగింప వలెనన్న అభిప్రాయముతోను, మన పూర్వకాలపు ఆచార వ్యవహారముల యొక్కమాభివ్యక్తిని తెలిసికొనుటకును ఒక కాశీ పుడితుని సహాయముచే ఋగ్వేదములను భాషాంతరీకరింప సమకట్టితిని, ఋగ్వేదముల మూలములోని మొదటి సగముభాగము సభచే సంపాదింపబడినది. ఇక భాష్యములన్ననో, మాభాషాంతరీకరణమునకు సరిపడినన్ని సంపాదించితిమి. కాని 'వేదములను భాషాంతరీకరించుట బాహ్మాండమైనపని. సంహితలోనే పది వేల శ్లోకములను మించి యుండెను. ఎప్పటికైన సమాప్తి చెయ్యగలుగుదునా యని బెంగ పట్టుకొనెను. ఐననునాకు సాధ్యమైనంత భాషాంతరీకరించి 'తత్వబోధినీ' పత్రిక యందు ప్రకటించుచుంటిని.


ఇది వరకు “బ్రహ్మసమాజ ఉపాసనావిధానములో నీ రెండు సూత్రములు మాత్రముండెను:--

సత్యంజ్ఞాన మనంతం బ్రహ్మ
" ఆనందరూప మమృతం యద్విభాతి. ”

ఇవి అసంపూర్ణముగా నుండెను. "శాంతం. శివమ ద్వైతం అని చేర్చుటచే నదిపూర్తిగావింపబడెను. ప్రధమమున సమాజో పాసనాప్రణాళి వ్రాసిన మూడు సంవత్సరముల పిమ్మట 1848 వ సంవత్సరములో నిది చేర్చితిని.