పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[9]

రామకృష్ణపరమహంస

65

చుకొనఁ దలంచుచుండ నప్పు డద్భుతముగాఁ గొన్ని వెదుళ్ళు తాటియాకులు నార మొదలగు గుడిసెకు గావలసిన పరికరములు గొట్టుకొనివచ్చి వానికంటఁబడెను. ఆపరికరముల నతఁడు వెంటనేగ్రహించి కొందఱు సేవకుల సాయమునఁ గుటీరము నిర్మించుకొనియె.

ఇవ్విధంబునఁ బరమయోగియై రామకృష్ణుఁడుండ నతనిభార్య పుట్టినింట నీడేరి పదునెనిమిదేండ్లు ప్రాయముగలదయ్యె తలిదండ్రులామెతో నీమగఁడు పిచ్చివాఁడయ్యె నమ్మా యనిరి. కొందఱు లోకులతఁడు పరమయోగియయ్యెనని చెప్పవిని శారాదామణిదేవి యట్టిమగని నొక్కసారి కన్నులారఁజూడ వేడుకపడి తల్లిదండ్రుల సెలవు పొంది వాని యొద్దకుం బోయి తన్నెఱిఁగించుకొనియె. రామకృష్ణుఁడామెనాదరించి యిట్లనియె. "పూర్వపు రామకృష్ణుఁడు మృతినొందినాఁడు. నేను క్రొత్తవాడను. లోకమునందలి యాడువాండ్రందఱు నాకెట్లు తల్లులో నీవునునాకు తల్లివిగాని భార్యవుగావు. "అని యామెపాదములకుమ్రొక్కి యాశీర్వదింపుమని ప్రార్థించి పువ్వులతోఁ బూజించి వెంటనే సమాధిగతుఁడై యొడలెఱుఁగకఁ బడియె. మగనికిం దెలివి వచ్చినపిదప నాయిల్లాలు "స్వామీ నేను మీతపమున కంతరాయము గలిగింపను. మీపాదసేవ సేయుచు నిచ్చటనే పడియుండెద. నాకందుకు సెలవి"మ్మని వేడిన నతఁడామె వేడికోలంగీకరించె. ఆమెయు భర్తవలెనే నిస్పృహ గలిగి విరాగియైయుండె. మధురనాథుఁ డొకనాఁడామెనుంబిలిచి "తల్లీ నీకు నేను పది వేల రూపాయలిచ్చెదను. నీవు బోయి సుఖముగా నుండుమనిచెప్ప శారదామణిదేవి నవ్వి "నాయనా! నాభర్త ధనము నిరాకరించియే మహాత్ముఁడయ్యె. నేనును వాని ననుసరించెద, నాకు ధనమెందు" కని నిరాకరించె.

అనంతరము కొన్నినాళ్ళకు మధురనాథుఁఁడు తీర్థయాత్రలకుఁ బోవుచు రామకృష్ణుని వెంటగొనిపోయి ఆయాత్రలలో రామకృష్ణుడు