పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

64

మహాపురుషుల జీవితములు

వైష్ణవులు భగవంతు నైదువిధములుగా సేవింతురు. 1. సేవకులు యజమానుని గొలిచినట్లు 2. మిత్రులొండొరులఁ బ్రేమించునట్లు 3. తల్లిదండ్రులు బిడ్డలఁ బ్రేమించునట్లు 4. బిడ్డలు తలిదండ్రులఁ బ్రేమించునట్లు 5. భార్య భర్తను వలచునట్లు ఈయైదిఁంటిలోఁ గడపటి విధమే యుత్కృష్టమయిన దనియు నామార్గమునే పూర్వము గోపికలు రాధాదేవియు ననుసరించి ముక్తులైరనియు నమ్మి రామకృష్ణుఁడు కొన్ని దినములు స్త్రీ వేషముదాల్చి తాను భగవంతుని భార్యయగు రాధనని యెంచి తత్సంయోగమునకై పలుమారు ప్రార్థించెను. ఒకనాఁడు సమాధిలో నతనికి ముద్దుమొగముతో గోపాలకృష్ణదేవుఁడు సాక్షాత్కరించినందున నతఁడు గృతార్థుఁడయ్యె. రాధ పరమభాగవతోత్తమురాలనియు నామె గోపాలదేవునియందు వలపు నిలుపుట భక్తిచేతనేగాని సంభోగార్థము గాదనియు జ్ఞానవంతులేకాని పామరు లాగ్రంథములఁ జదువఁ గూడదనియు రామకృష్ణుని యభిప్రాయము. భక్తియోగమునందిట్లు సిద్ధిని గాంచిన పిదప నతఁడు మహమ్మదీయ పద్ధతి ప్రకారము కొన్నిదినములు భగవంతుని ధ్యానించెను. ఆవల క్రైస్తవసిద్ధాంత ప్రకారము కొన్ని దినము లీశ్వరుని సేవించెను. ఆదినములలో నతనికి యేసుక్రీస్తొకమారు కనఁబడి వానిని ధన్యునిజేసెను. రామకృష్ణుఁడేమత మవలంబింప దలఁచునప్పు డామతస్థుఁ డొకఁడతని వద్దకువచ్చి తద్రహస్యములన్ని యునతనికిఁజెప్పునఁట. అన్ని మతముల నవలంబించుటచే ప్రతిమతము మంచిదేయనియు నేమత మవలంబించినను మనుష్యులకు ముక్తిదొరకుననియు నొకొక్క మతమఖండ సచ్చిదానంద స్వరూపుండగు భగవంతుని గుణములు దెలుపుననియు నతఁడభిప్రాయపడెను.

అతఁడు సంకల్పసిద్ధుఁడని వాడుక. ఒకనాఁడాయన గంగయొడ్డునఁగూర్చుండి తనయోగాభ్యాసమున కనువుగా నొకకుటీరమునునిర్మిం