పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవర్షి దేవేంద్రనాథటాగూరు

23



నాథటాగూరు. దేవేంద్రనాథునితండ్రి. ఈతఁడు మిక్కిలి యైశ్వర్యముఁగలఁ జమీందారుఁడయ్యుఁ జక్కఁగనింగ్లీషు చదువుకొని న్యాయవాదియై యాపనిలో నపారముగఁ గీర్తియు ధనమును సంపాదించి యంతతో నూరుకొనక నిరువురు దొరలంగూడి వర్తకముఁ జేసి కోటీశ్వరుఁడయ్యెను. ఈయన రాజా రామమోహనరాయలకు సహకారి యయి సహగమనము నడచి వేయుటలోను హిందువుల కింగ్లీషుభాష నేర్చుటకయి హిందూకళాశాలను స్థాపించుటలోను వానికిఁ జాలఁ దోడ్పడి కుడిభుజమట్లుండెను. అంతియగాక రామమోహనుడింగ్లాండునకుఁ బోయినపిదప వానిచే నెలకొలుపఁబడిన బ్రహ్మసమాజమున కీతఁ డధ్యక్షుఁడయి దానిని నిలిపెను. ఎఱిఁగినవారందఱు నితనిని మహారాజా ద్వరకనాథటాగూ రనుచుండెడివారు. వాని యౌదార్యము మితిమీరినదగుటచే వంగ దేశమునం దేసత్కార్యమును దల పెట్టినను వీనిసాయము లేక యది నెర వేరదయ్యె. ఈయన కీర్తి యూరపుఖండమునందు హిందూ దేశమునందును సమానముగ వ్యాపించి యుండెను. ఇతఁడు 1841 వ సంవత్సరమున యూరపుఖండమునకుఁ బోయి యింగ్లాండు ఫ్రాన్సు మొదలగు దేశములకుఁ జని యచ్చటి రాజులచేత సయితము మిక్కిలి గౌరవింపఁబడెను. ఈతఁ డింగ్లాండునకుఁ బోయినతోడనే దేశోపకారార్థమై వచ్చి యచ్చట మృతినొందిన రామమోహనరాయల కొక గోరిఁ కట్టించెను. యూరపునుండి మరుచటి సంవత్సర మతఁడువచ్చి మరల 1845 వ సంవత్సరమున నింగ్లాండునకుఁ బోయి 1846 వ సంవత్సరమున తన ప్రియమిత్రుఁడగు రామమోహనునివలె నా దేశముననే లండను నగరమున మృతినొందెను. ద్వారకనాథునకుఁ గల ముగ్గురు కొడుకులలోను దేవేంద్రనాథటాగూరు జ్యేష్ఠపుత్రుఁడు. ఈతఁడు 1817 వ సంవత్సరము మెయినెలలో జన్మించెను. తండ్రి తల్లికడఁ జిన్న నాఁట నుండియుఁ జను వెక్కువగనుండుటచే నామె మనుమని ననేక పుణ్య