పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

132

మహాపురుషుల జీవితములు

'హిందూదేశ దర్పణము' అని యర్థమిచ్చు 'ఇండియన్ మిర్రరు' పత్రికను ప్రకటింపఁ జొచ్చెను. అది ప్రారంభమున పక్షపత్రికగ ప్రకటింపఁ బడుచువచ్చెను. ఆపత్రికయె యిప్పుడు దినపత్రికయై కలకత్తాలో మిక్కిలి పేరుబడి యున్న యది.

మానమోహనుఁడు సహజముగమిక్కిలి దెలివి తేటలుగలవాఁడయ్యు 1864 వ సంవత్సరమునందును 1865 వ సంవత్సరమునందును గూడ సివిలుసర్విసు పరీక్షలోఁ గృతార్థుఁడు కాలేకపోయెను. అతఁడు పరీక్షయందుఁ దప్పిపోవుటకు వాని తెలివితక్కువ కారణము కాదు. అదివఱకున్న నిబంధనలు కొన్ని మారుటచేతను సంస్కృతము మొదలగు కొన్ని ప్రాగ్దేశపు భాషలకు మునుపటి విలువ తగ్గిపోవుట చేతను మానమోహనుని కృషి వ్యర్థ మయ్యెను. ఇంగ్లాండు దేశములో హిందూ దేశస్థులకు జరుగు సివిల్ సర్వీసు పరీక్షనుగూర్చి యతఁడొక చిన్న పుస్తకమును వ్రాసి యందులో నింగ్లీషువారికిఁ గల లాభములను మనకు గల ప్రతిరోధములను జక్కఁగ విమర్శించి వివరించెను. అతడు సివిలుసర్వీసు పరీక్షకు జదువుచున్న కాలముననే 'బారిష్టరు' పరీక్షకు గూడ జదువనారంభించి, మొదటిదానిలో నెరవేరు యోగము లేకపోయినను రెండవదానిలో గృతార్థుడై 1886 వ సంవత్సరమున బారిష్టరై వచ్చెను. చదువంతయు ముగియకమునుపే తండ్రి పరలోకగతుడగుటచే మానమోహనుడు పరీక్షకాగానే స్వదేశమునకువచ్చి 1867 వ సంవత్సరము జనేవరు 10 వ తారీఖున కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా జేరెను.

కలకత్తా హైకోర్టులో నితడే మొట్టమొదటి బారిష్టరు. ఆ కోర్టులో పనిచేయుచున్న నితనితోడి బారిష్టరులగు తెల్లవారు నల్లవాడని మానమోహనుని తమతో సమానముగా గౌరవింపక యలుసుగ జూచుచు మీదుమిక్కిలి యతడు నిర్ణేతకాలము బారిష్టరు తర