పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాన మోహన ఘోషు

ఈతఁడు హిందూదేశమందు సుప్రసిద్ధిఁగాంచి 1903 వ సంవత్సరమున చెన్న పట్టణమందు జరిగిన దేశీయ మహాసభ కధ్యక్షుఁడగు 'లాల్‌మోహను ఘోషు' గారి సోదరుఁడు. ఆయనది ఢక్కా జిల్లాలోని విక్రమపురము కాపురము కులముల నితఁడుకాయస్థుఁడు. అతని తండ్రియగు 'రామలోచనఘోషు' సబుజడ్జీ యుద్యోగముచేసి రాజరామమోహన రాయలువారు తలపెట్టిన సంఘసంస్కరణ మహాకార్యమునం దభిమానము కలిగి వానికి కుడిభుజమైపనిచేసెను. మానమోహనుఁడు 1854 వ సంవత్సరము 13 వ మార్చినాఁడు జన్మించెను. బాల్యమం దితఁడు 'కిష్ణఘరు పాఠశాలలోఁ జదువుకొనెను. 1859 వ సంవత్సరమున మార్చి నెలలో మానమోహనుఁడు ప్రవేశపరీక్షయందు గృతార్థుఁడై 1861 వ సంవత్సరమున కలకత్తా ప్రెసడెన్‌సీ కాలేజీలో చేరెను. అచ్చట నత డొక్క వత్సరము మాత్రమే చదివి మరుసటి సంవత్సరము 'సివిల్ సర్వీసు పరీక్షకు' చదువుకొనుట కింగ్లాడునకు బోయెను. 1860 వ సంవత్సరమునందు (అనగా మానమోహనుడు క్రిష్ణఘరు నందున్న కాలముననే) బంగాళాదేశమున నీలిమందు కఱవుపట్టెను. ఆకఱవువలన ననేకులు చెడిపోయిరి. ఆక్షామమువలనఁ గలిగిన దారుణ నష్టములం గూర్చి మానమోహనుఁడు 'హిందూ పేట్రియాటు' అను పత్రికకుఁ దఱుచుగా లేఖలను వ్రాసి పంపుచుండువాఁడు. ఆపత్రికాధిపతియైన హరిశ్చంద్రముకర్జీ మృతినొందుటయు నది కారణముగాఁ దత్పత్రిక క్రొత్తచేతులలోనికిఁ బోవుటయుఁ జూచి మంచిపత్రిక మఱియొకటి స్థాపింపవలెనని నిశ్చయించి మానమోహనుఁడు మఱికొందఱి సాయమున