పుట:Mahaakavi dairiilu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3

డైరీలు


1889


16 ఆగస్టు :

మహారాజావారి ఆస్థానములో 'డిబేటింగుక్లబ్‌' ఏర్పడినది. ఉపాధ్యక్షుడుగా ఎన్నుకోబడితిని.

6 సెప్టెంబరు :

సెలవు వొకనెల పొడిగించితిని.

16 సెప్టెంబరు :

శర్మగారివద్దవున్న నా ప్రాక్టీసాఫ్ ఎలక్యూషన్ (వక్తృత్వాభ్యాసము) అనే గ్రంథం తేవలెను. 'లివింగ్ ఆథర్స్‌' (సజీవకవులు), 'హిన్ట్సు ఆన్ ఎలక్యూషన్‌' అనే పుస్తకములు ప్రిన్సిపాలుగారివద్ద వుండిపోయినవి. ఎ లుక్ రౌండ్ లిట రేచర్ (సాహిత్యసమీక్ష) ఎనాలిసిస్ ఆఫ్ యింగ్లీషు లాంగ్వేజి (ఆంగ్లభాషావిమర్శ) ప్లెజర్ ఆఫ్ డిసల్యూటరీ రీడింగ్ (ఇచ్ఛానుసార పరనమందలి ఆనందము) గ్రంథములను చదివితిని.

4 అక్టోబరు, శుక్రవారం :

విజయదశమి పండుగ. రెండుసంవత్సరముల క్రిందట ఈరోజున నాకీప్రస్తుత ఉద్యోగము లభించినది. అందువల్ల నాకెట్టి మనశ్శాంతికలిగినదో మహారాజావారికి తెలిసివుండదు. మహారాజావారిని పరమేశ్వరు డనుగ్రహించుగాక *[1]సి. సి. గారి కొరకు నా ప్రార్థనలు.

  1. *శ్రీ సి. చంద్రశేఖరశాస్త్రిగారు.