పుట:Mahaakavi dairiilu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గురజాడ రచనలు

4


6 అక్టోబరు, ఆదివారం :

మహారాజావారు ♦[1] జె. యస్. తో, 'ప్రతివారమూ హార్పులో కవిత్వము వ్రాయరాదా?' అనిరి. మానవులలోగల పశుప్రవృత్తినిగురించి చర్చజరిగినది.

7 అక్టోబరు, సోమవారం :

గతనెల మొదటి తేదీ నుంచి నాకు జీతంలో అయిదు రూపాయిల యింక్రిమెంటు వచ్చింది. ఆర్డరు నెంబరు 118. కళాశాలలో చరిత్ర పాఠములను బోధిస్తూ వున్నంతకాలమూ యిది అమలులో వుంటుంది.

8 అక్టోబరు, మంగళవారం :

నా కింతకంటె హెచ్చు యింక్రిమెంటు యీయలేక పోయినందుకు ప్రిన్సిపాలుగారు తమ విచారమును వెలిబుచ్చిరి.

కోటలో యివాళ "జ్ఞానప్రదమైన సాహిత్యము, శక్తివంతమైన సాహిత్యము" అనే సంప్రదాయ సిద్ధమైన సారస్వత విభాగమును గురించి చర్చ జరిగినది.

27 అక్టోబరు, ఆదివారం :

కాంగ్రెసు మీటింగు. బ్యాంకు ఏజంటు మాక్డ నలుగారికి నా ఉపన్యాసము పంపవలెను. మాధవరావుగారికి 'హార్పు'లో ప్రచురించడానికి ఉపన్యాసపు కాపీ కావలెనట.

  1. ♦ శ్రీ జిడ్డు సుందర్రావు పంతులుగారు.