పుట:Mahaakavi dairiilu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

అనంతరము, సాహిత్యములో వొక విభాగముగా యివి ప్రాముఖ్యమునకు వచ్చినవి. విట్‌లాక్ (1605-75) రచించిన డైరీ, ఎంతో ప్రధానమైనదని ఆంగ్లసాహిత్య విమర్శకులు పేర్కొంటున్నారు. షేక్స్పియరు సమకాలికుడైన జాన్ ఎవిలీన్ (1620-1706) డైరీ ఎప్పటికప్పుడు వ్రాసింది కాకపోయినప్పటికీ అందులో కొన్ని స్ఖాలిత్యములున్నా ఆంగ్లసాహిత్య చరిత్రలో ప్రశస్తిని పొందింది. ఇది డబ్భైసంవత్సరాల ఆంగ్ల దేశ చరిత్రను తెలిపే డైరీ. యధార్థతకు, రచయిత వ్యక్తిత్వ నిరూపణకు ఉదాహరణగా శామ్యూల్ పెపీస్ (1633-1703) రచించిన డైరీని పేర్కొనదగునని ఆంగ్ల విమర్శకుల అభిప్రాయం. సుప్రసిద్ధకవి జాన్ బైరన్ (1692-1763) గుప్తపరచుకున్న డైరీ ఎన్నికైనది. ఇవన్నీ నాటి ఆంగ్లదేశ సాంఘిక రాజకీయ స్వరూపమును ప్రతిబింబించే అద్దములవంటివి.

డైరీలు, నాటి దేశ పరిస్థితులను తెలుసుకోవడానికి మాత్రమేకాక, అవి రచించిన ఆ, యా వ్యక్తుల జీవిత వృత్తాంతాలను గ్రహించడానికి ఉపకరిస్తవి. వారి జీవిత చరిత్రలను లిఖించుటకు ఇతరులకివి తోడ్పడతాయి. లియో టాల్‌స్టాయ్ డైరీలను ఆధారంగా తీసుకుని, ఆయన మనమరాలు, తన తాతగారి జీవిత కథను రచించినది.

అయితే డైరీల ప్రాధాన్యము అవి రచించిన వ్యక్తుల ప్రాముఖ్యమును బట్టి నిర్ధారిత మవుతుంది. వ్యక్తుల ప్రాముఖ్యము పుట్టుకవల్ల వచ్చేదికాదు. సామాజిక సమస్యలపట్ల వారు అవలంబించిన వైఖరీ, దేశాభ్యున్నతికి, ప్రజాహితమునకు వారు చరిత్రలో నిర్వహించిన పాత్రా, జీవితముపట్ల వారు