పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


య లేకపోయిరి. ధనికాధనికులకుఁ బోరాట మయ్యెను. అప్పుడు సభవారు మరణదండన మాపుచేసి యతనిని దేశోచ్చాటనము చేసిరి. సభవారందుకు విచారించిరి. ధనికులు సన్నమైరి. అధనికులు ప్రసన్నమైరి. మనోధైర్యము చెడక తల్లికి నమస్కారము చేసి భార్యా పుత్రాదులను పలుకరించి వారిని విడిచి యతఁడు నలుగురు భృత్యులతోఁ గలిసి పరదేశమునకుఁ బోయెను.

తరువాత నతఁడు 'వాల్సియను'లను ప్రజలను పురికొలిపి వారితోఁగూడ దండెత్తి వచ్చి రోమనులను జయించవలె నని ఉద్దేశించెను. ఆ ప్రకార మతఁడు వారి యొద్దకుఁ బోయెను. వారికి రోమనులకుఁ బరమవైరము. వారి నాయకుఁడైన 'టల్లసు', రోమనుల నాయకుఁడు కోరియోలేనస్సుకు, బద్ధద్వేషి. వారి 'కోరియోలి' పట్టణమును ధ్వంసము చేయుటచేత కోరియలేనస్సను పౌరుషనామ మితనికి వచ్చెను. శత్రువుల పట్టణముఁ బ్రవేశించి, 'టల్లసు' గృహమున కితఁడు పోయి లోపలఁ బ్ర వేశించెను. వాని నెవ రాటంక పెట్ట లేకపోయిరి. కావలివారు లోపలకుఁ బరుగెత్తి మహాపురుఁషు డొక్కఁడు వచ్చి సభామండపములో నుండెనని 'టల్లసు'తో మనివిచేసిరి. కోరియ లేనస్సు చేతులతో ముఖము మూసికొని కూర్చునియుండెను. అతనిఁ జూచి 'మీరెవ రండి? ఏమి పనిమీఁద దయ చేసినా' రని టల్లసు' అడిగెను. 'నే నెనరో తమరుపోల్చ లేదా? రోమనులతో కలిసిమీతోపోరాడి,