పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోరియ లేనస్సు

65


మీ పట్టణమును ధ్వంసముచేసి, కోరియలేనస్సను పౌరుష నామమును బొందినవాఁడను. నీకు ప్రతి వీరుఁడను. ఎవరితో నీవు ,నైరమును సాధించవలె సని కోరితివో యతఁడే నేను. నా దేశస్థులు నన్ను మన్నించక నేను చేసిన మహత్కార్యములకు వారు నన్ను వెడలఁగొట్టిరి. వారిని సాధించవలె నని కోరి నీయొద్దకు వచ్చినాఁడను. శత్రువుల గుట్టు తెలిసినందున నీపక్షమునఁ బోరాడి, పూర్వముకన్న విశేషముగ శౌర్యమును జూపించఁగలను. నా మాటను మన్నించినయెడల యుద్ధసన్నాహము చేయుము. లేనిపక్షమున నన్ను నీ యిష్టాను సారము శిక్షించవచ్చు'నని కోరియలేనస్సు ముఖము మూసికొని ప్రతి వచనమియ్య, అందుకు 'టల్లసు' సమ్మతించి యతనిని కౌఁగిలించుకొనెను. వాల్సియనుల సమావేశము చేసి, వారిని కోరియలేనస్సు పురికొలిపెను. మాటకారియె కాక, పనివాఁడని వా రతనిని శ్లాఘించిరి. వారు రణభేరి వేసిరి. దరువులు ధణధణ మ్రోయఁగ, దళవాయులు వారి దళముల నడిపింప సాగిరి. రోముపురసీమలలో వారు దండువిడిచిరి. రోమనులు: సమరసన్నాహము లేక యున్నందున, భయ కంపితులైరి. కోరియలేనస్సుచేత వాల్సియనులు నడిపింపఁబడి, సమీప పట్టణములను ముట్టడించి వానిని పట్టుకొనిరి. రోమనులు నిశ్చేష్టులై యేమియు తోఁచక యుండిరి.

అప్పుడు రోమనులు సంధిచేయుటకు యత్నించి రాయ