పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోరియ లేనస్సు

63


దర్శకుని పనికి నిలఁబడెను. ఈ పని మనుజులచేతిలోనిది. వారి యంగీకారముపైని యెవరినైన నియోగించుచుండిరి. పని కావలసినవాఁడు శరీరమును దుస్తులతోఁ గప్పికొనక తాను చేసిన మహత్కార్యములను వారితో చెప్పి యందుకు నిదర్శనముగ వాని శరీరముమీఁది గాయములను వాఁడు చూపింపవలయును. కోరియలేనస్సు ఇటులఁ జేసెను. మొదట ప్రజలితని నా పనిలో నియోగించుటకు సమ్మతించిరి కాని వారి చిత్త మంతలో మాఱి సభవారితో నతఁ డేకమై తమరిని నలుఫునను భయము కలిగి యతని కాయుద్యోగము నిచ్చుటకు వారియ్యకొనలేదు. ఆ పనిలో మఱియొకఁడు నియోగింపఁబడెను. ఇటులఁ బరాభవమును బొంది 'కోరియలేనస్సు' స్వగృహమునకు వెళ్లెను.

అతని యహంకార మతనికి ముప్పుఁదెచ్చెను. వినయ విధేయతలు లేక కార్యములను సాధించువిధ మతఁడు బాగుగ గుఱ్తెఱింగినవాఁడు కాఁడు, ప్రభుశక్తి విశేషముగ నతనికిఁ గలదు. అతని యాటోపమునకు రోసి ప్రజ లతనిమీఁదఁ కొన్ని నింద లారోపించిరి. తా ననింద్యుఁడ నని యతఁడు సభలోఁ బ్రసంగించినను నతని మాటలను వినక 'టార్పియను' పర్వతశిఖరమునుండి క్రింది కతనిని దిగఁద్రోయవలసిన దను శిక్షను సభవారు విధించిరి. ధనికులందఱు నతని పక్షమే. కొండమీది కతనిఁ దీసికొని వెళ్లిరి. కాని అతనిని దిగంద్రో