పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


చేసినందున వానిని విడుదల చేయవలసిన'దని సభవారిని ప్రార్థించెను. వా రందుకు సమ్మతించి యటులచేసిరి. అప్పుడు జయశబ్దములు మ్రోగెను. ప్రజలు సంతసించిరి. ఈర్ష్యాళురు సహిత మతనిని గౌరవించిరి.

ఇంతలో క్షామము వచ్చెను. ప్రజలకు తినుటకు కూడు లేకుండెను. పదార్థములను కొనుటకు ధనము నిండుకొనెను. అవికూడ సమృద్ధిగ లేకుండెను. దీనికిఁ గారణము ధనికులను ప్రాకృతజననాయకులు వదలివేయుటయే. ఈలోపున 'వెలిట్రి' పట్టణవాసులు పరాభవము నొందినటుల రాయబారులు వచ్చి సభవారితోఁ జెప్పి యా పట్టణము నిర్మానుష్యముగ నుండుటచేతఁ గొందఱి ప్రజల నక్కడకుఁ బంపవలసిన దని వారు వేఁడిరి. ఆప్రకారము కొందఱు సామంతులును సంసారులును బీదలును నా పట్టణమునకుఁ బోవలసినదని సభవా రుత్తరువు చేసిరి. ఈ ప్రకారముచేసిన దుండగీండ్రచేత విడువఁబడి పట్టణము స్వాస్థ్యముఁ బొందు నని సభవా రభిప్రాయపడిరి. ప్రాకృతజననాయకులు ప్రజలను పురికొలిపి వారి యాజ్ఞోల్లంఘనము చేయుటకు సమకట్టిరిగాని 'కోరియలేనస్సు' వారి తుంటరితనము నణఁగఁగొట్టి వారి నా పట్టణమునకుఁ బంపెను. విషవాయువులు విడిచినపైని శరీరము సుఖమును పొందినట్లు వీరు తరలిపోయినపిదప రోముపట్టణము, హాయిగ నుండెను.

కొంతకాలము గడచినపిదప 'కోరియలేనస్సు' యక్ష