పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


ప్రజల కప్రియమైనను దానినే విస్తరింపఁజేసి వారికి హితవుగ న్యాయాన్యాయములను విచారించుచుండెను.

అతని భార్యపేరు 'టెరన్షియా'. వీరి దాంపత్య మనుకూలముగనుండెను. భర్తయొక్క వ్యసహారములలో నామె సహకారినుండెను. భర్త త్రిశక్తియుతుఁడైనను నతని కామె మంత్రోత్సాహశక్తుల నాపాదించుచుండెను. దంపతు లిరువురుఁ బట్టణములో సన్మానమును విశేషముగఁ బొందుచుండిరి. పరులను మన్నించి వారిచేత మన్ననలను వీరు పొందుచుండిరి. ఆహితలక్షణుండును, రోషామర్షాహిషనిషేధుండును గుణాఢ్యుండును, నావేగాగమ వర్జితుండును నై యతఁ డొప్పుచుండెను.

ఎంత గొప్పవారికైన కాల మొకరీతిగ గడువఁబోదు. కాలాంతరమున నతఁ డజాతశత్రు నైనను వ్యవహారరీతిని గొందఱతనిపై శత్రుత్వమును బాటించి మంచి చెడ్డలను విచారించక దేశోచ్చాటనము జేసిరి. అతని గృహములను వారు తగుల పెట్టిరి. అతని స్వామ్యములను రాష్ట్రమునకుఁ గలిపిరి. అతఁడు చేశాంతంగతుఁడై పరదేశములలో ప్రజలచేత సత్కరింపఁబడెను. ఈలోపున నతని శత్రువులు పదభ్రష్ఠులైరి. అతని కర్మ పరిపక్వమయ్యెను. పదియారు మాసములకు స్వదేశమున కతఁడు వచ్చెను. అతని రాకకు ప్రజలు రాకకువలె నెదురు చూచిరి. తలవంపులైన శత్రువులకుఁగూడ నతని రాక మేలు రాక