పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శిశిరో

27


గమనించినపుడు తన స్నేహితులకుఁ జెందిన గృహక్షేత్రములను నిరూపించుచుండెను.

దినచర్య గడుచుటకు తగినంత స్థితి యున్నను నది విశేషముగ లేనందున న్యాయవాదములలో నతఁడు పణమును స్వీకరించకపోవుట చిత్రముగనున్నది. కొంత స్వామ్యము గలవాఁడై దాని మూలమున దేహయాత్రను సంతుష్టిగ నతఁడు జరిపెను. యుక్తాహారవిహారములు యుక్తమగు చేష్టలతోఁగూడి రోములు, గ్రీకులులోని విద్వాంసుల గోష్ఠినిఁ బొంది కాలము నతఁడు గమనించెను. అతని దర్శనముఁ జేయుటకు ప్రతిరోజును గొంద ఱతని గృహమునకుఁ బోవుట కలదు. రాజకీయ వ్యవహారములలో 'పాంపేయి' యనువాని కతఁడు తగినట్లు యోచనలను చెప్పుచుండెను.

అతనిని 'ప్రేటరు' అను నొక న్యాయాధికారిగ నియమించిరి. అతఁడు వ్యవహారములను నిష్కళంకముగ నిర్వర్తించెను. లంచములు పుచ్చుకొని న్యాయము నీతిపంథనుండి తప్పించి యపంథలోని కతఁడు త్రిప్పుట లేదు. మఱి కొంతకాలమున కతఁడు 'కాన్సలు' అను పెద్ద న్యాయాధికారిగా నియో గింపఁబడెను. ఎక్కడనున్నను న్యాయముఁ దప్పక తన వాచాలత్వము చేత సత్యమునకు వన్నెతెచ్చి ప్రజలచేత నతఁడు మన్నింపఁబడెను. నీతి పథమును దప్పక సత్యసంకల్పముతోఁ