పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xii

పీఠిక


మూడి దక్షిణామూర్తిశాస్త్రిగారికిని, సారిపాక నర్సింహశాస్త్రిగారికిని వందనములు చేయుచున్నాను. చిత్తులు సవరణలతోఁ గూడిన లిఖిత పత్రములనుజూచి వానిలోఁ గొన్ని పత్రములను స్ఫుటముగ వ్రాయుటలోఁ దోడ్పడిన నా ప్రియ స్నేహితులు మ. రా. రా. చిలుకూరి నారాయణరావుపంతులు బి. ఏ. గారి నభినుతించుచున్నాను. నా ముఖ్య స్నేహితులు మ. రా. రా. ఉలుగండం వెంకటనర్సుపంతులుగారు గాన రూపమైన స్తవమునకు రాగము, తాళము సరిపెట్టినందుకు వారిని సన్నుతించుచున్నాను. నా ప్రాణస్నేహితులు మ. రా. రా. గా. హరిసర్వోత్తమరావుపంతులు ఎం. ఎ. గారు దీనికి మెఱుఁగుబెట్టి వన్నె తెచ్చినందుకు వారిని సంస్తుతిజేయుచున్నాను. "విజ్ఞానచంద్రికామండలి"వారు దీనిని స్వీకరించుటచే దీనికి గురుత్వము వచ్చినదని నా భావము. వారీగ్రంథము నతిత్వరితముగ ముద్రింపించి ప్రచురింపించినందుకు వారికిఁ గృతజ్ఞతాపూర్వకముగ నభివందనము లిడుచున్నాను.

ఇట్లు

విధేయుఁడు

గ్రంథకర్త.

గంజాం జిల్లా,

శ్రీకాకుళం

22 - 5 - 1913