పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


వాని శరీరమును దెప్పించి, దాని నతఁడు దగిన మర్యాదలతో బాతిపెట్టించెను.

అతఁడు మహోన్నతపురుషుఁడు; విశాలఫాలముగలవాఁడు; వెడదయురమువాఁడు. భేతాళుని (Hercules) వంశమువాఁడని వాడుకగలదు. అతఁడు పెద్ద గడ్డము పెంచెను; పెద్దకత్తి పట్టుకొని తిరుగువాఁడు; సైనికులచేతఁ బ్రేమించఁబడెను. వారివలె నతఁడు భాషను వెఱ్ఱిమొఱ్ఱిగ మాటలాడుచుండెను; వారితోఁ గలిసి భోజనము జేయుట. గలదు. అతఁడు శృంగారచేష్టలలోఁ దిరుగుటయేగాక, పరులను వానిలో దింపుచుండెను. అతఁడు మహాదాత; అడిగిన వానికి లేదని చెప్పుట లేదు. ఈ సుగుణ మతని దుర్గుణములను గప్పివేసెను.

ఈ కాలములోఁ బాంపేయునకు, సీౙరుకు వైరము మెండయ్యెను. ఆంతొని, సీజేరుపక్షము నవలంబించెను. పాంపేయుఁడు యుద్ధములో నోడి, యీజిప్టు దేశమునకుఁ బోయెను; సీౙరు సర్వాధికారి (Dictator) యయ్యెను. ఇతఁడు, ఫ్రాన్సు, స్పానియా దేశములకుఁ బోవునపుడు, రోమునగరములో నాంతోనిని సర్వాధికారిగ నియమించి, తాను వెడలెను.

ఆంతొని 'ఫుల్వియా' యను నామెను వివాహమాడాను. ఆమె స్త్రీయైనను, పురుషలక్షణములు గలది. సేనాధిపతులను,