పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మార్కు-ఆంతోని

117


ప్రజాధిపతుల నామె లొంగదీసెను. ఆమె చేతిలో నాంతొని యేపాటివాఁడు? ఆమె మాట కతఁ డెదురునడుచుటకు వీలులేదు. ఆమెను లాలనఁ జేయదలఁచి, యామేచేత నతఁడు లాలనఁ జేయఁబడెను.

ఈలోపున సీజరు స్పానియాదేశమునుండి జయము బొంది వచ్చుచుండెను. ఇతని నెదురుకొనుటకై ఆంతొని వెళ్లెను. ఉభయులొక రథముమీఁదఁ గూర్చొనివచ్చిరి. వీరజయోత్సవములు చేయఁబడెను. రాజమర్యాదలు సీౙరు బొందెను; కాని అతఁడు రాజచిహ్నములను ధరించుటకు ప్రజ లియ్యకొనలేదు. మరి కొంతకాలము గడచినపైని, సీౙరు దుర్మరణము నొందెను.

ఈ సంగతివిని ఆంతొని చాల దుఃఖించెను; తన వాచాలత్వముఁ జూపి ప్రజల రేపెట్టెను. వారు కుట్రదారుల గృహములను దగుల బెట్టిరి; పట్టణము విడిచిపోఁజేసిరి, తరువాత సీౙరుయొక్క మేనగోడలికొడుకు 'అగస్టసు - సీౙరు', ఆంతొనియొద్దకు వచ్చెను. ఇతఁడు చిన్నవాఁడని యుపేక్షించి, వచ్చినవాని ఆంతొని విశేషముగ మన్నించలేదు. అగస్టసు కోపగించి, దేశములోనికిఁ బోయి, సైన్యములను గూర్చ నారంభించెను. ఆ సంగతి 'ఆంతొని' విని బలములను బోగుచేయ సమకట్టెను. ఉభయసైన్యములు దారుకొని పోరాడెను. ఆంతొని పరాజయముఁ బొందెను.

అతఁడు మార్గములో నానాశ్రమలుపడి, 'ఆల్ప్సు' పర్వత