పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మార్కు-ఆంతోని

115


వైరముపుట్టెను. ఆంతొని మంచి చక్కనివాఁడు; శృంగార పురుషుఁడు. స్నేహితులతోఁ గలిసి మద్యపానముఁ జేయుచు, వారాంగనల పొత్తును బొంది కాలముగడిపి, 250 టాలంటులు ఋణముచేసెను. ఈ సంగతి తండ్రి, తెలిసికొని, 'కుమా రాంతొని'ని గృహము వెడలఁగొట్టెను. అతఁడు వెంటనె గ్రీసుదేశమునకుఁ బోయి, యక్కడ రణశిక్షను బొంది, వక్తృత్వము నభ్యసించెను.

గ్రీసుదేశములో 'గబీనియసు' అనువాఁడు పాక్షదర్శకుఁడు (Proconsul) గ నుండెను. ఇతఁడు సిరియాదేశమునకు యుద్ధమునకు వెళ్లినపు డాంతొనిని గూడ రమ్మమనెను గాని, యతఁ డనామికుఁడుగ వెళ్లుట కిష్టపడనందున, నతనిని రాహుత్తుల సేనానిగ నియోగించి వెంటఁదీసికొని వెళ్లెను. ఆంతోని మహాశూరుఁడు. సిరియాలోని పట్టణమును ముట్టడించినపుడు, ప్రహరీగోడల నతఁడు ముందుగ నెక్కెను. శత్రువుల దునుమాడి, రోమకుల కతఁడు జయముఁ గలుగఁ జేసెను.

తరువాత మరికొన్ని దినములకు 'ఈజిప్టు' దేశపురాజు తనకు సహాయముఁ జేయుటకుఁ గొంత సైన్యమును బంపవల సినదని కోరినందున, 'గబీనియసు' 'ఆంతొని'ని సైన్యముతో వెడలవలసిన దని యుత్తరువు చేసెను. అతఁ డచటకుఁబోయి, రాజు యొక్క శత్రువులను దునుమాడెను. అతని స్నేహితుఁ డొకఁడు శత్రుపక్షమున పోరాడి, పోరాటములోఁబడినందున,