పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మార్కు-ఆంతోని

ఇతని తాతపేరు మార్కు-ఆంతోని'. ఇతఁడు 'సిల్లు' ని పక్షములోనివాఁ డగుటచేత దుర్మరణమునొందెను. ఇతని తండ్రిపేరు 'ఆంతొని'. ఇతఁడు పెద్ద యుదోగ్యములు చేసినట్టు కనఁబడదు. అయిన నితఁడు ధార్మికుఁడు; శాంతుఁడు; నెమ్మదిగఁ గాలముఁ గడిపెను. ఇతనియొద్ద కొక స్నేహితుఁడు డబ్బు లేనందున, సహాయముచేయుమని కోరవచ్చెను. ఇతని వద్ద సొమ్ములేదు; లేదని చెప్ప లేఁడు; అందులో, భార్యవద్ద భయము. కుమారునిఁ బిలిచి, వెండిగిన్నెలో నీరుపోసి తెమ్మని చెప్పి, వాఁడు దానిని తెచ్చినతరువాత, వానిని లోనికిఁ బంపివేసి, యాగిన్నెను స్నేహితునికిచ్చి వీనిని సంతోష పెట్టెను. తరువా తా గిన్నె కనఁబడనందున, భార్య పరిచారకులను దండించుటకు సిద్ధ మయ్యెను. అప్పు డితఁ డామెతో దాఁ జేసిన సంగతిఁ జెప్పి, యామెను శాంతిపఱచెను.

తండ్రి మరణమునొందెను; తల్లి మరియొకనిని వివాహ మాడెను. పిదపఁగూడ నతఁడు తల్లి సంరక్షణలో నుండెను. సవతితండ్రి 'కాటిలీని' కుట్రలోఁ గలిసియున్నందున, శిశిరో యతనినిఁ జంపించి వేసెను. అందుచేత, శిశిరోకు, ఆంతోనికి

114