పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాంపేయుఁడు

105


కార్పణ్యము వహించును; దొరికినవానిఁబట్టి యప్పగించ నందుకు 'సీౙరు' కోపగించును. అందుచేత, నిరాయుధుఁడుగ నున్న పాంపేయుని మంచిమాటలతోఁ జేరఁదీసి యతనిని జంపుట మేలు. సీౙరుకు మీయం దనుగ్రహము కలుగును. పాంపేయుఁడు మిమ్ముల నేమియుఁ జేయ లే"డని కుమార రాజునకు బోధ చేసిరి.

నగరములోనికి విజయము చేయవలసిన దని కుమార రాజు వర్తమానముఁ బంపి నందున, పాంపేయుఁ డొక పర్యాయము భార్యను ముద్దులాడి, కుమారునిఁ గౌఁగిలించుకొని, యొక చిన్న పడవనెక్కి యొడ్డునఁ జేరెను. మామగారైన సీౙరును నమ్మి యతని సముఖముననుండిన, దన చేయి క్రిందగు నని యెంచికదా, పాంపేయుఁడు పరదేశరాజును నమ్మి యతని చేతిలోఁబడెను. రెండు కత్తు లొక వరలో నిమిడియుండలేవు. అతఁ డొడ్డునకు వచ్చి చేర, కుమార రాజు వచ్చి వందనము చేసెను. వందన ప్రతి వందనములైనపిదప పాంపేయుఁడు ప్రసంగించుటకు యత్నించుచుండ, హంతకులు వెనుకనుండి వచ్చి యతనిని బాకులతోఁ బొడిచి చంపిరి. మరణమునొందు సరి కతనికి 59 సంవత్సరముల వయస్సు. ఈ యుపద్రవమును జూచి భార్య కుమారుఁడు మొదలగువారు భయపడి నావను గడుపుకొని పోయిరి.

అతని వెంటవచ్చిన పరివారకుఁ డొకఁ డాశవమును