పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


ముప్పువచ్చెను. కొండెగాం డ్రీ మాటలను సీౙరుతోఁ జెప్పి, వాని మాటలను పాంపేయునితోఁ బలికి వారికి మనస్పర్థలను రగిలించిరి.

సీౙరు, పాంపేయుఁడు, వీరిరువు రతిరథశ్రేష్ఠులు. సేనాధిపతులు. ఒకఁడు భూసైన్యములకు నాయకుఁడు; మఱియొకఁడు భూనావికాసైన్యముల కధికారి. వీరిరువురు రోమునగరము స్వాధీనముఁ జేసికొని మహారాజ్యాధిపత్యమును స్థాపించుటకు సమకట్టియుండినవారు. ప్రళయకాలమున మహాబలప్రేరితంబులై క్షుభితంబు లగు మహాసముద్రంబులు చెలియలిగట్ట నతిక్రమించుట కుప్పొంగు విధమున ప్రత్యానీక సైన్యంబులు రెండును మార్కొని పోరాటము సలిపిరి. సీౙరుఁ జయముఁబొందెను,

పాంపేయుఁ డపజయముఁబొంది దారాపుత్రాదులతోఁ గొందఱు పరివారకులు వెంటరా నొక పడవనెక్కి. పరదేశములకుఁబోయెను. ఏదేశపురాజును జేపట్టి శత్రువును శిక్షించుటకు దగిన సైన్యమును లేవనెత్తుటకు వీలగు నని పాంపేయుఁడు చింతించెను. 'ఈజిప్టు'దేశము నేలుచున్న కుమారరాజు తన కాప్తుఁ డని యెంచి, యక్కడకుఁ బోవుట కతఁడు సమకట్టి కుమారరాజునకు వర్తమానముఁ బంపెను. అప్పు డితని మంత్రులు "ఏలినవారు పాంపేయునిఁ జేరఁదీసిన, సీౙరు మీకు శత్రు, వగును; పాంపేయుఁడు యజమానుఁ డగును. మర్యాదఁ జేయక పాంపేయునిఁ బొమ్మనిన నతఁడు