పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

శ్లో|| క్వసూర్యః ప్రభవో నంశః క్వచాల్పవిషయామతిః |
      తితీర్షుదు౯ స్తరం మోహాదుడుపేనాస్మిసాగరమ్ ||
      మందః కవియశః ప్రార్థీగమిష్యామ్యపహాస్యతాం |
      ప్రాంశు లభ్యే ఫలే లోభా దుద్బాహురినవామనః ||
                                          కాళిదాసః, రఘు. 1. 3-4.


లోకము కర్మసూత్రగ్రధితము. కర్మము ద్వివిధముః స్తోకమని, అస్తోక మని. మనుజుఁడు కర్మిష్ఠి. కర్మలేని భోగం బపోహంబు. అసందర్భంబు లసంభవములు. వర్తమాన దుఃఖంబులు భూతకాల స్వకర్మోపార్జింతంబులు, స్వస్తోక కర్మోద్భవంబులు. ఇవి యసాధువులు, రిక్తములు, దేశాభివృద్ధి నిరోధకములు. ఆ హేతువంజేసి త్యాజ్యంబులు. స్తోకకర్మిష్ఠులు కనిష్ఠులు.

వర్తమానమెటుల భూతకాలభవమో, అటులనె, భవిష్యత్కాలము వర్తమానోద్భవము. భవిష్యత్కాలభోగంబులకు వర్తమానకర్మ లుపాదానంబులు. ఆ కారణముంజేసి, అస్తోకకర్మ లనుష్ఠేయంబులు. అస్తోకకర్మిష్ఠులు గరిష్ఠులు. స్వాస్తోకకర్మ లతిరేకములు. అతిపథమునకు గరిష్ఠు లధ్వగులు.