పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


దోషములు రాకుండునటుల నతఁడు దేవతలకుఁ బ్రార్థనచేసి తదుపరి మాటలాడుచుండెను.

అతఁడు వ్యవహారములను యుక్తముగ నడిపెను, నీతి మార్గమును తప్పక న్యాయము తీర్చుచుండెను. నాటకముల కని పౌరుష క్రీడలకని మహోత్సవముల కని ప్రజల ధనము వ్యయముకాకుండ రాజ్యాదాయములోని సొమ్ము వ్యయపఱచి ప్రజల నతఁడు సంతోషపెట్టెను. రాజ్యవ్యయము క్రింద లెక్కవ్రాసి, ప్రతిసంవత్సర మరువది నావలను సిద్ధపఱచి, వానిమీఁద నావికాయాత్ర చేయుటకు నెనిమిది నెలలు ప్రజలను బంపుచుండెను. మఱికొందఱి నతఁడు నూతన సీమలలోఁ గాపురముఁ జేయుటకుఁ బ్రయాణముఁ జేసెను. ఇటుల నూతన సీమలకుఁ బంపివేయుటచేత, దుర్మార్గులచేత విడువఁబడి నగరము స్వాస్థ్యముఁ బొందెను. నూతనసీమలలోనివారు విదేశీయులకు భయము కలిగించి, స్వదేశముయొక్క మూలబలమును బ్రకటనఁ జేయుచు, దానికి దూరరక్షకులుగ నుండిరి.

ఇంతకంటె గొప్పకార్యము లతఁడు చేసెను. ఆథెన్సు పట్టణములోని పెద్ద దేవాలయములు, మంటపములు, చిత్రవస్తు ప్రదర్శనశాలలు మొదలగు భవనముల నతఁడు గట్టించెను. దేశ దేశములనుండి పనివాండ్రా పట్టణములో వచ్చి చేరిరి. చిత్రకారులు, తక్షకులు, లేపకారులు, రజ్జుకారులు మొదలగు పనివారు వచ్చిరి. ప్రజల విహారాదుల కొఱ కారామముల