పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెరికిలీసు

87


క్ష్యము చేయలేదు. సభామంటపమునకుఁ బోవునపుడును మొగసాలకు వెళ్లునప్పుడును నతఁడు రాజమార్గములలోఁ గనఁబడును గాని తదితరసమయములలో నతని దర్శన మగుట దుర్లభము. అతఁ డందఱతోను ముక్తసరిగ మెలఁగును. అతి స్నేహము లేదు; వైరములేదు. చనువుగనుండిన, నధికారముయొక్క మహత్తు చెడునని యతని యభిప్రాయము. ఎవరు పిలిచినను విందుల కతఁడు వెళ్లుటలేదు. అధికారములో నున్నందున వారు తనను విందులకుఁ బిలిచి, ప్రసన్నునిగ చేయఁదలఁచెదరని యతఁ డూహించెను; వెళ్లిన పైని, మనస్సు నిర్మలముగ నుండక వారు చెప్పిన మాటలచేత కలుషమై, ప్రజలకు న్యాయము కలుగ దని యోచించి విందులకు వెళ్లుట మానుకొనెను. న్యాయాధికారు లెప్పుడు సపక్ష పరపక్ష విచక్షణ లేక నిష్పక్షపాతముగ న్యాయము విచారించిన, బ్రజల కనురాగము కలుగునని యాలోచించి యతఁ డా ప్రకారము నడిచెను,

తన విశిష్టభావములను మాతృభాషలో వర్ణించి, మృదుమధుర శైలిలో తన యుచ్చస్థితికి తగినటుల మాటలాడుట కతఁడు సమకట్టెను. ఇందు కతని గురూపదేశములు సహాయమయ్యెను. సహజముగ నున్న కల్పనశక్తితో ప్రకృతితత్వశాస్త్రములలో నేర్చిన సంగతులను గలిపి, వక్తలలో నతఁడు శ్రేష్ఠుఁ డయ్యెను, సభలోఁ బ్రసంగించుటకుఁ బూర్వము, శబ్దార్థ