పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/105

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
86
ప్లూటార్కు వర్ణితచరిత్రలు


లోచన పరుఁడని తోఁచును; గాంభీర్యము కలవాఁడు; డాంబికముగ దుస్తులను ధరించువాఁడుగాఁడు; అందఱతో మర్యాదగ మాటలాడను. మాటలలో కాపట్యము లేదు. అందుచేతఁ బ్రజ లతనినిఁ బ్రేమించిరి.

ఒక రోజువ, తుంటరి యొకఁ డతనిని ముఖశాలలో దూషించుచుండెను. అతఁడు దానిని లక్ష్యము చేయలేదు. ప్రల్లదములు మాను మని వాని కతఁ డుత్తరువు చేయలేదు. సాయం సమయమున నతఁడు స్వగృహమునకు వచ్చుచున్నపుడు, వాఁడు దారిలో నతనిని నోటికి తోచినటుల మాటలాడుచున్నను వానిని వారింపలేదు. స్వగృహముచేరి, వానియింటిలో వానిని దిగవిడిచి రమ్మనుమని తన పరిచారకునితో నతఁడు చెప్పిపంపెను. ఈ సహనము గురూపడేశమువలన కలిగినదె. ఇదియెకాదు. కారణములు తెలిసికొనలేక, ప్రకృతివిషయములను జూచి భయపడు ప్రాకృత జనులను బోలక, వాని యాదార్థ్యము నతఁ డా కాలమునకు తగినటుల గ్రహించెను.

చిన్నతనమునుండియు నతఁడు ప్రజలయెడ నయముగ భయముగ మెలఁగుచుండెను. 'తెమిస్టాకలీసు' మొదలగు రాజకార్యధురంధరులు మృతినొందినపైని, అతఁడు రాజ్య సూత్రములను ధరించెను. ప్రజారాజ్యము గనుక నతఁ డధనికుల ప్రాపకమును విశేషముగఁ గోరినను ధనికుల నతఁడు నిర్ల