పుట:Leakalu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మెలసి మసలడంవల్ల నా సాంగత్యఫలితంగా నీకు సారస్వతాభి రుచీ అభినివేశమూ ఉత్సాహమూ కలిగాయని నువ్వు చెబుతు న్నావు. సరే సంతోషం. అయితే వొక్కమాట. నీతో పరి చయం కలగడంవలన రానున్న తరంలో యువకులు మాకన్న ఎక్కువ సాహిత్యకృషి చేయగలరన్న విశ్వాసం నాకు కుదిరింది. యువకులపట్ల ఆప్యాయమూ అభిమానమూ కలిగాయి. నీ పరిచయంవల్ల మళ్ళీ నా స్వయంవ్యక్తిత్వాన్ని నేను పొంద


నేను వారిపిల్లలతో సమానడనైతిని. వారును వారింటికివచ్చు వారందరును నట్లే నన్ను పరిగణించియుండిరి. గుర్రపుబండిమీద వారెక్కడికైన వెళ్ళునపుడు నేనుగూడ బోవుచుంటిని,"

  • శ్రీ సుబ్రహ్మణ్యంగారికి మహాకవితో కలిగిన పరిచయం వారి వాక్యాలలోనే: "1908 వ సంవత్సరములొ ప్రయివేటుగా ఎఫ్. ఏ చదువుచు మాతండ్రిగారి బలవంతముమీద నేను విజయనగరం సంస్థా నము ఆఫీసులో నెలకు పది రూపాయిలు జీతంమీద గుమాస్తాగా నుంటిని: అట్టిసమయములో మాతండ్రిగారు వకనాడు నన్ను శ్రీ అప్పారావు పంతులవారివద్దకు దీసికొనిపోయి నా సంగతి వారితో ముచ్చటించగా వారు నన్ను సంస్థానం ఆఫీసుకు పోపుట మానివేసి ప్రతిదినం ఉదయం ఏడుగంటల నుండి పదిగంటలవరకు తమ ఇంటివద్దనుండి వారుజెప్పిన పని జేయుచుండుమని నాకు జెప్పిరి. పదిరూపాయలకు గుమాస్తాగా నుండుట చాల అవమానకరమని యెంచిన నాకు పంతులవారి ఇంట పని చేయుట విశేషసంతోషదాయకమయ్యెను. ఆ మరునాటినుండియు నేను ఉదయం ఏడుగంటలకు అప్పారావుపంతులవారి ఇంట హాజరగుచుంటిని. వారివద్ద తెలుగు సంస్కృత గ్రంథములను మనదేశమందలి శిలాశాసన ముల రికార్డులుగల ఎపిగ్రాఫికా ఇండికా ఇండియన్ యాంటిక్వరీ నెల్లూరు జిల్లా శాసనములు మున్నగునవిన్నీ మూడునాలుగు బీరువాల గ్రంథములున్నూ వుండెడివి. విజయనగర సంస్థానమునకు చెందిన శాస నములును, విజయనగరరాజుల బంధువుల వంశవివరములను తెలుపు
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/73&oldid=153022" నుండి వెలికితీశారు